Persons of all castes as temple priests: అర్చకత్వంలో అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బలహీన వర్గాలకి చెందిన 58 మందికి అవకాశం కల్పిస్తూ ఇవాళ అర్చక నియామక పత్రాలను అందించారు. దీంతో దేవాలయాల్లో అర్చకత్వంలో అందరికీ సమాన హక్కులు కల్పించాలని పోరాడిన దివంగత నేత కరుణానిధి ఆశయాన్ని కుమారుడు స్టాలిన్ నెరవేర్చినట్లైంది.
అంతేకాదు, తమిళనాడులోని ప్రముఖ ఆలయాలలో అన్ని వర్గాలకు చెందిన నూతన అర్చకులను సీఎం స్టాలిన్ ఇవాళ నియమించారు. అన్ని కులాలవారికి అర్చకత్వంలో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుత అర్హత ప్రకారం మహిళా అర్చకులకు శిక్షణ తరగతులను ఇప్పటికే స్టాలిన్ సర్కారు ప్రారంభించింది.
రానున్న రోజులలో తమిళనాడులోని అన్ని ప్రముఖ దేవాలయాలలో మహిళా అర్చకులను నియమిస్తామని, మహిళలతోపాటు అర్చకత్వంలో ఎటువంటి తారతమ్యాలు లేకుండా అన్ని కులాల వారికీ అవకాశం కల్పిస్తామని సీఎం స్టాలిన్ హామీ ఇచ్చారు.
Read also: Sandalwood: కరవు ప్రాంతంలో శ్రీగంధం గుబాళింపులు.!! గుట్టల కొలదీ గంధపు చెక్కలు