TTD: తిరుమల దేవస్థానంలో అర్చకుల కొనసాగింపుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నోటిఫికేషన్ విడుదల..

AP government: తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకుల కొనసాగింపుపై ఏపీ దేవదాయశాఖ శనివారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ మేరకు

TTD: తిరుమల దేవస్థానంలో అర్చకుల కొనసాగింపుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నోటిఫికేషన్ విడుదల..
TTD

Updated on: Apr 10, 2021 | 1:48 PM

AP government: తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకుల కొనసాగింపుపై ఏపీ దేవదాయశాఖ శనివారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ మేరకు వంశపారంపర్యంగా కొనసాగే అర్చకుల కొనసాగింపునకు రెండు విధానాలు అమలు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే.. తితిదే నిర్ణయించిన మార్గదర్శకాల ప్రకారం.. ఆరోగ్యంగా ఉన్నంతకాలం పనిచేసుకోవచ్చు. దీంతోపాటు తిరుమలలో విధులు నిర్వహిస్తూ.. 65 ఏళ్లకు పదవీ విరమణ చేసే వారు.. వారి కుమారులకు అర్చకత్వం కోసం నామినేట్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

అయితే ఈ రెండు విధానాల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకునే అవకాశాన్ని అర్చకులకు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా.. తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకుల కొనసాగింపు విషయంపై గత కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది.

Also Read:

Temple dispute : దేశంలో తెరపైకి మరో వివాదం, కాశీ విశ్వనాథ్ ఆలయం, జ్ఞాన్‌వాపి మసీదు‌పై ASI సర్వేకు కోర్టు అనుమతి

Temple dispute : దేశంలో తెరపైకి మరో వివాదం, కాశీ విశ్వనాథ్ ఆలయం, జ్ఞాన్‌వాపి మసీదు‌పై ASI సర్వేకు కోర్టు అనుమతి