Amarnath Yatra 2022: అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రారంభం.. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకోండి..!

|

Apr 11, 2022 | 10:23 AM

Amarnath Yatra 2022: కరోనా వల్ల రెండేళ్లు వాయిదాపడిన అమర్‌నాథ్‌ యాత్ర ఈ ఏడాది పునఃప్రారంభం కానుంది. ఈ యాత్ర జూన్ 30 నుంచి ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతోంది.

Amarnath Yatra 2022: అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రారంభం.. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకోండి..!
Amarnath Yatra
Follow us on

Amarnath Yatra 2022: కరోనా వల్ల రెండేళ్లు వాయిదాపడిన అమర్‌నాథ్‌ యాత్ర ఈ ఏడాది పునఃప్రారంభం కానుంది. ఈ యాత్ర జూన్ 30 నుంచి ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతోంది. అయితే అమర్‌నాథ్‌ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏప్రిల్‌ 11 నుంచి ప్రారంభమవుతుందని అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు సీఈవో నితీశ్వర్‌ కుమార్‌ ప్రకటించారు. జమ్మూ కశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో 3000 మంది యాత్రికులకు వసతి కల్పించే యాత్రి నివాస్ నిర్మించారు. ఈ ఏడాది సగటున మూడు లక్షల మంది యాత్రికులు ఆలయాన్ని సందర్శిస్తారని బోర్డు అంచనా వేస్తోంది. ఈరోజు నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతున్నాయి. యాత్రికులు పుణ్యక్షేత్రం బోర్డు వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా J&K బ్యాంక్, PNB బ్యాంక్, యెస్ బ్యాంక్, SBI బ్యాంకులలో ప్రయాణానికి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. పుణ్యక్షేత్రం బోర్డు యాత్రికులను ట్రాక్ చేయడానికి వీలుగా వారికి RFID (Radio Frequency Identification ) ఇస్తారు. అంతేకాదు ఇన్సూరెన్స్‌ కవరేజీ వ్యవధిని ఒక సంవత్సరానికి పెంచారు. యాత్రికుల బీమా మొత్తాన్ని ఈ ఏడాది రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు.

ఆరోగ్య ధృవీకరణ పత్రం అవసరం

COVID-19 మహమ్మారి కారణంగా 2020, 2021లో అమర్‌నాథ్ యాత్రను నిర్వహించడం సాధ్యం కాలేదు. అలాగే 2019 ఆగస్టు 5వ తేదీకి కొన్ని రోజుల ముందు కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసింది. దీంతో యాత్రని నిలిపివేశారు. ఇప్పుడు ప్రయాణానికి భక్తుల ఆరోగ్య ధృవీకరణ పత్రం, నాలుగు పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌లు అవసరం. అలాగే దరఖాస్తు ఫారమ్ పూర్తిగా నింపాలి. రోజు పది వేల మంది భక్తులను పంపుతారు. అమర్‌నాథ్ యాత్ర పహల్గాం, బల్తాల్ రెండు మార్గాల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో హెలికాప్టర్‌లో వచ్చే భక్తులు వేరుగా ఉంటారు. మార్చి 28, 2022 తర్వాత జారీ చేసిన ఆరోగ్య ధృవీకరణ పత్రాలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి.

Indian Railways: రైలు టికెట్‌పై ఉండే ఈ 5 అంకెల సంఖ్యని గమనించారా.. ఇందులో ఉండే సమాచారం ఏంటో తెలుసా..!

Funny Video: పాపం జాగ్వార్.. చాలా ట్రై చేసింది కానీ కుదరలేదు..!

Electricity Bill: ఏసీ వల్ల కరెంట్‌ బిల్లు పెరిగిపోతుందా.. ఈ 5 మార్గాల్లో తగ్గించుకోండి..!