Chanakya Niti: చక్కని సంబంధాలను నిలబెట్టుకోవాలంటే ఆచార్య చాణక్య చెప్పిన ఈ నియమాలు తప్పనిసరి 

|

Aug 03, 2021 | 9:27 PM

ప్రతి ఒక్కరూ ఇతరులతో మంచి సంబంధాన్ని కోరుకుంటారు. అది వ్యాపార రీత్యా లేదా వ్యక్తిగతంగానూ కావచ్చు. మంచి సంబంధాలు ఏర్పరుచుకోవడం.. వాటిని కొనసాగించడం చాలా క్లిష్టమైన పని.

Chanakya Niti: చక్కని సంబంధాలను నిలబెట్టుకోవాలంటే ఆచార్య చాణక్య చెప్పిన ఈ నియమాలు తప్పనిసరి 
Chanakya Niti
Follow us on

Chanakya Niti: ప్రతి ఒక్కరూ ఇతరులతో మంచి సంబంధాన్ని కోరుకుంటారు. అది వ్యాపార రీత్యా లేదా వ్యక్తిగతంగానూ కావచ్చు. మంచి సంబంధాలు ఏర్పరుచుకోవడం.. వాటిని కొనసాగించడం చాలా క్లిష్టమైన పని. ఆచార్య చాణక్య ఎప్పుడో మానవుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలనే విషయంపై ఎన్నో విశేషాలు చెప్పారు. చాణక్య పలుకులు కాలంతో పాటు నడుస్తూనే ఉన్నాయి. కాలం ఎంత మారినా చాణక్య నీతి ఇప్పటికీ ఆచరణాత్మకంగానే ఉంటుంది. ఆచార్య చాణక్య సంబంధాలను ఏర్పరుచుకుని విషయంలో ఎలా ఉండాలి.. సంబంధాలను ఎలా నిలబెట్టుకోవాలి అనే అంశాలపై కూలంకషంగా వివరించారు తన చాణక్య నీతి గ్రంధంలో మరి ఇప్పుడు అయన చెప్పిన విషయాలను తెలుసుకుందాం. 

ఒక వ్యక్తి తన జీవితంలో బలమైన సంబంధాలను ఎలా నిర్మించుకోగలడు? దానికి అతను ఎలాంటి లక్షణాలను కలిగి ఉండాలో ఆచార్య చాణక్య వివరంగా చెప్పారు.  

అందరినీ సంతోషంగా ఉంచడం ఏ వ్యక్తికి అంత సులభం కాదు. అలా అని ఎదుటివారిని మోసగించి సంతోషంగా ఉంచాలని కాదు. ఇటువంటి పనివలన ఏర్పడిన సంబంధాలు బలంగా ఉండవు.  మోసంతో ఏర్పడిన సంబంధం  కొన్ని రోజుల్లో చెడిపోవడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల సంబంధాలు చెడిపోవడమే కాకుండా అవమానాలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. సంబంధాలలో ప్రేమ అలాగే నమ్మకం పునాదిగా ఉండాలని చాణక్య చెప్పారు.

మధురంగా వ్యవహరించడం..

ఆచార్య చాణక్య ప్రకారం, ఏ వ్యక్తి అయినా ప్రసంగంలో మాధుర్యం,వినయం ఉండాలి. ప్రతి వ్యక్తి హృదయంలో ప్రేమ ఉండాలి. మధురంగా ​​మాట్లాడటం కఠిన హృదయుడిని కూడా కరిగించగలదు. అందువల్ల, మీ ప్రసంగంలో ఎల్లప్పుడూ మాధుర్యం ఉండాలి. అదేవిధంగా ఎదుటి వ్యక్తితో ఎట్టి పరిస్థితుల్లోనూ తీయగానే వ్యవహరించాలి. కఠినంగా వ్యవహరించడం సంబంధాల్ని నిలబెట్టదు.

అహం ముందుకు సాగనివ్వదు..

అహంకారం ఏ వ్యక్తికైనా హానికరం. దీని కారణంగా, ఏదైనా సంబంధం చెడిపోవచ్చు. చాణక్య ప్రకారం, ఏ వ్యక్తికీ అహం ఎక్కువగా ఉండకూడదు. సంబంధ బాంధవ్యాల కంటే అహం గొప్పది కాదు. అహం వలన మంచి సంబంధాలు తెగిపోవడమే కాదు ఎప్పుడూ తిరిగి అతుక్కోవు కూడా. 

సంబంధాలలో గౌరవాన్ని కాపాడుకోండి..

ఏదైనా సంబంధంలో గౌరవాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రతి సంబంధంలో గౌరవాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. అందువల్ల, కోపంలో, ఎవరినీ తక్కువ చేసి చూపించడానికి లేదా బాధపెట్టడానికి ప్రయత్నించకూడదు. ఎల్లప్పుడూ మీ అహాన్ని విడిచిపెట్టి సరైన విషయాలకు సహకరించండి. అలాంటి వ్యక్తికి సమాజంలో ఎల్లప్పుడూ గౌరవం లభిస్తుంది. ఎదుటి వ్యక్తికి  మీరిచ్చిన గౌరవం మీకు తిరిగి దక్కుతుంది. 

Also Read: Chanakya Niti: ఈ అలవాట్లకు దూరంగా ఉంటే మీరు కోటీశ్వరులు కావచ్చు.. చాణక్యుడు చెప్పిన పెద్ద రహస్యం

చాణక్య నీతి : వ్యక్తులకు చెడు పరిస్థితులు ఎలా వస్తాయి? ఎటువంటి వారు ఆ పరిస్థితులను తప్పించుకోలేరు?