భారతీయులు వాస్తును ఎంతలా విశ్వసిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే నిర్మాణః మొదలు, ఇంట్లో పెట్టుకునే వస్తువుల వరకు అన్ని వాస్తుకు అనుకూలంగా ఉండేలా జాగ్రత్తలు పడుతుంటారు. ఏ వస్తువులు ఏ దిశలో ఉండాలన్న ప్రతీ విషయాన్ని వాస్తు శాస్త్రంలో స్పష్టం పేర్కొన్నారు.
టీవీ మొదలు ఫ్రిడ్జ్ వరకు వాస్తు పాటించే వారు. ఆర్థికపరమైన విషయంలో వాస్తును పట్టించకపోతే ఎలా చెప్పండి. అందుకే ఇంట్లో డబ్బును దాచుకునే ప్రదేశం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. అందుకే డబ్బులు, నగలు దాచుకునే అల్మార విషయంలో కొన్ని వాస్తు నిపుణులు కచ్చితంగా పాటించాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు. అల్మారలో ఎట్టి పరిస్థితుల్లో కొన్ని వస్తువులను పెట్టకూడదని చెబుతున్నారు. ఇంతకీ ఆ వస్తువులు ఏంటంటే..
* డబ్బులు దాచుకునే అల్మారాల్లో కొందరు ఫెర్ఫ్యూమ్స్‌ను కూడా పెడుతుంటారు. అయితే ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదని నిపునులు చెబుతున్నారు. ఫెర్ఫ్యూమ్స్‌ను లాకర్స్‌లో పెడితే ఆర్థికపరమైన నష్టాలు తప్పవని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
* ఇక డబ్బులు దాచుకునే వాటిలో బీరువాలు కూడా ఒకటి. అయితే డబ్బులు, నగలు పెట్టుకునే బీరువాలకు అద్దాలు లేకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బీరువాలకు అద్దాలు ఉండడం వల్ల ఆర్థికపరైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని సూచిస్తున్నారు.
* లాకర్స్‌లో చిరిగిన కాగితాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల ఇంట్లో నెగిటివ్ శక్తి వేగంగా పెరుగుతుందని చెబుతున్నారు. దీనివల్ల ఆర్థిక నష్టాలు ఎదురై, డబ్బుకు లోటు ఏర్పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందుకే పనికిరాని కాగితాలను లాకర్స్‌లో ఉంచుకోవచ్చు.
* నలుపు అంటేనే నెగిటివ్‌గా భావించే వారు మనలో చాలా మంది ఉంటారు. అందుకే డబ్బులు, నగలు దాచుకునే లాకర్స్‌లో ఎట్టి పరిస్థితుల్లో నల్లటి వస్త్రాలు లేకుండా చూసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. అలాగే డబ్బును ఎట్టి పరిస్థితుల్లో నల్లటి దుస్తుల్లో చుట్టి పెట్టకూడదని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే డబ్బు త్వరగా ఖర్చు అవుతుందని చెబుతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..