Spiritual News: పొద్దుపోయాక ఈ పనులు చేస్తున్నారా.? కష్టాలు తప్పవు సుమా..

|

Sep 26, 2023 | 9:35 PM

సమయం ఆధారంగా కూడా మనం చేసే పనికి ప్రతిఫలం ఉంటుందని చెబుతున్నారు. కొన్ని పనులు ఉదయం పూట చేస్తే మంచి జరుగుతుంది. అదే విధంగా సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు చేస్తే మాత్రం చెడు ఎదుర్కోక తప్పదని నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కొన్ని పనులను చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ...

Spiritual News: పొద్దుపోయాక ఈ పనులు చేస్తున్నారా.? కష్టాలు తప్పవు సుమా..
Sun Set
Follow us on

మనం చేసే ప్రతీ పనికి ప్రతిఫలం ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే ఆ పని ఎప్పుడు చేస్తామన్న దానిపై కూడా స్పష్టత ఉండాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. సమయం ఆధారంగా కూడా మనం చేసే పనికి ప్రతిఫలం ఉంటుందని చెబుతున్నారు. కొన్ని పనులు ఉదయం పూట చేస్తే మంచి జరుగుతుంది. అదే విధంగా సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు చేస్తే మాత్రం చెడు ఎదుర్కోక తప్పదని నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కొన్ని పనులను చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ సూర్యాస్తమయం తర్వాత ఎలాంటి పనులు చేయకూడదు.? ఏ పని చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి.? లాంటి పూర్తి వివరాల కోసం ఓ లుక్కేయండి..

పొద్దు పోయాక చేయకూడని పనుల్లో ఒకటి తులసి మొక్క ఎట్టి పరిస్థితుల్లో తాకకూడదు. అయితే సాయంత్రం తులసి మొక్క వద్ద దీపాన్ని వెలిగించడం సర్వ సాధారణమైన విషయమే, కానీ మొక్కను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాకకూడదని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇక సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో చీపురుతో ఇంటిని ఊడవకూడదు. ఈ సమయంలో లక్ష్మీదేవీ ఇంట్లోకి అడుగుపెడుతుందని భావిస్తారు.

కాబట్టి సాయంత్రం చీపురుతో ఇల్లు ఊడిస్తే లక్ష్మీదేవీ ఇంట్లో నుంచి బయటకు పోతుందని చెబుతున్నారు. లక్ష్మీ దేవీతో పాటు ఆనందం కూడా ఇంట్లో నుంచి కనుమరుగువుందంటున్నారు. ఒకవేళ ఇంట్లో ఏదైనా చెత్త పడితే చేతితోనో, లేదా ఏదైనా క్లాత్‌తో తీసేయాలని చెబుతున్నారు. ఇక సూర్యాస్తమయం తర్వాత పాలు, పెరుగు, పంచదార వంటి తెల్లని వస్తువులను ఎవరికీ ఇవ్వకూడదని నిపుణులు చెబుతున్నారు.

ఇక సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా అప్పు ఇవ్వకూడదని శాస్త్ర పండితులు చెబుతున్నారు. సాయంకాలం తర్వాత డబ్బులను ఇతరులకు ఇవ్వడం వల్ల లక్ష్మీదేవీకి కోపం వస్తుందని సూచిస్తున్నారు. దీంతో ఇంట్లో ఆర్థిక సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇక సాయంత్రం సమయంలో ఉప్పును కూడా ఎవరికీ ఇవ్వకూడదు. సాయంకాలం కట్టింగ్ చేసుకోవడం, గడ్డం తీసుకోవడం, గోళ్లు కట్ చేయడం లాంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఇలా చేస్తే ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులతో పాటు, చికాకులు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని సాయంకాలం ఏ పనులు చేయాలి.? ఏ పనులు చేయకూడదనే నిర్ణయం తీసుకోవాలంటున్నారు.

నోట్‌: పైన తెలిపిన అంశాలు కేవలం కొన్ని శాస్త్రాల్లో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..