Yadadri Temple : యాదాద్రిలోవారం రోజుల తర్వాత ఆర్జిత సేవలు పున:ప్రారంభం, దేవాలయంలో పెరిగిన భక్తుల రద్దీ

|

Apr 04, 2021 | 10:35 AM

Yadadri Sri Lakshmi Narasimha Swamy Temple : తెలంగాణ ఆధ్యాత్మికధామం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆర్జిత సేవలు పున:ప్రారంభమయ్యాయి. దీనికి తోడు, ఆదివారం కూడా కావడంతో..

Yadadri Temple : యాదాద్రిలోవారం రోజుల తర్వాత ఆర్జిత సేవలు పున:ప్రారంభం, దేవాలయంలో పెరిగిన భక్తుల రద్దీ
Yadadri
Follow us on

Yadadri Sri Lakshmi Narasimha Swamy Temple : తెలంగాణ ఆధ్యాత్మికధామం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆర్జిత సేవలు పున:ప్రారంభమయ్యాయి. దీనికి తోడు, ఆదివారం కూడా కావడంతో యాదగిరి గుట్టలో భక్తుల రద్దీ ఇవాళ బాగా పెరిగింది. ఆలయ ఉద్యోగులు కరోనా బారిన పడడంతో వారం రోజులుగా భక్తులకు ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేసిన సంగతి తెలిసిదే. ఈరోజు ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమైన లక్ష్మీ నరసింహ స్వామి వారి సేవలు.. అభిషేకాలు.. అర్చనలలో భక్తులు పాల్గొంటున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శనం చేసుకునే విధంగా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. ఆర్జిత సేవలలో పాల్గొనేందుకు వచ్చే భక్తులు కరోనా నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆలయ ఈఓ గీత టీవీ9 ముఖంగా విన్నవించారు.

Read also : మంచిర్యాల జిల్లాలో ఇంట్లోకి దూసుకెళ్లిన ఎర్టిగ కారు.. కొడుకు అక్కడికక్కడే మృతి, భార్యభర్తలిద్దరికి తీవ్ర గాయాలు