సాధారణంగా భక్తులు తమ కోరికలు నెరవేర్చమని గుళ్లకు వెళ్లి దేవుళ్లను మొక్కుకుంటారు. ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. కానీ ఇక్కడ ఒక శునకం మాత్రం.. తనకు ఏం కష్టం వచ్చిందో ఏమో దేవుడ్ని వేడుకోవడానికి ఆలయానికి వచ్చింది. భక్తులతో కలిసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ వింత సంఘటన జరిగింది. వీరవాసరం మండలంలోని నందమూరిగరువులో ఆంజనేయస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో రోజూ భక్తులు స్వామివారిని వేడుకునేందుకు వచ్చి ప్రదక్షిణలు చేస్తారు.తమ మొక్కలు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో ఓ తెల్లని శునకం ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదు. ఆంజనేయస్వామి ఆలయం చుట్టూ భక్తులతో కలిసి అరగంటపాటు ప్రదక్షిణలు చేసింది. ప్రదక్షిణలు పూర్తివగానే అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే అది ఎటు వెళ్లిందో కూడా ఎవరికీ కనిపించలేదు. కుక్క ప్రదక్షిణలు చేస్తుండగా గమనించిన భక్తులు వీడియో తీశారు. అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇదంతా దేవుని మహిమేనని స్థానికులు, భక్తులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి