Lord Sri Rama: తుంగభద్రా నది తీరంలో రామయ్య.. 60 అడుగుల ఎత్తులో ఏకశిలా విగ్రహం..

| Edited By: Surya Kala

Jan 25, 2024 | 9:03 AM

అయోధ్య రామమందిరం లో బాల రాముడు ప్రత్యేక పూజలు అందుకుంటున్న సందర్భంగా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో గ్రామ పుర వీధుల్లో శ్రీ రాముని శోభ యాత్ర నిర్వహించారు. జై శ్రీరామ్ నామస్మరణంతో మంత్రాలయం మారు మోగింది. మహిళలు అభయ రాముడికి ఉదయం నుంచి పిండి వంటలు చేసి నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ అభయ రాముడి విగ్రహం దగ్గర వివిధ రకాల హోమం నిర్వహించారు. అభయ రాముడిని దర్శించుకునేందుకు రోజురోజుకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు.

Lord Sri Rama: తుంగభద్రా నది తీరంలో రామయ్య.. 60 అడుగుల ఎత్తులో ఏకశిలా విగ్రహం..
Lord Rama In Tungabhadra
Follow us on

అయోధ్యలోని సరయు నది తీరంలో బాల రాముడు భక్తుల పూజలు అందుకుంటూ ఉండగా.. తుంగభద్రా నది తీరంలో పవిత్ర మంత్రాలయంలో 68 అడుగుల అభయ రాముడు కాంతులీనుతున్నాడు. వేలాది భక్త జనం నుంచి పూజలను అందుకుంటున్నాడు. కర్నూలు జిల్లా మంత్రాలయం తుంగ తీరములో ప్రత్యేక పూజలు అందుకుంటున్న 60 అడుగుల ఏకశిల అభయ శ్రీ రాముని విగ్రహం… అయోధ్యలో శ్రీ బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన, అనంతరం అయోధ్య రామమందిరం లో బాల రాముడు ప్రత్యేక పూజలు అందుకుంటున్న సందర్భంగా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో గ్రామ పుర వీధుల్లో శ్రీ రాముని శోభ యాత్ర నిర్వహించారు. జై శ్రీరామ్ నామస్మరణంతో మంత్రాలయం మారు మోగింది.

మహిళలు అభయ రాముడికి ఉదయం నుంచి పిండి వంటలు చేసి నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ అభయ రాముడి విగ్రహం దగ్గర వివిధ రకాల హోమం నిర్వహించారు. అభయ రాముడిని దర్శించుకునేందుకు రోజురోజుకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు.

తుంగభద్ర నదితీరంలో వెలసిన గ్రామ దేవత మంచాలమ్మ చెంతన చేరిన రాముడు.
మాంచలమ్మ ఒడిలో కూర్చుని శ్రీ రాఘవేంద్రస్వామి ఒక్కడే పూజలు అందుకుంటున్న సమయంలో శ్రీరాముడు కూడా పూజలు అందుకున్నాడు. శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భక్తులు శ్రీరాముని దర్శించుకునేందుకు కొండాపురం అభయ ఆంజనేయస్వామి దగ్గర  ఉన్న అభయ రాముడికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు  తీసుకుంటున్నారు భక్తులు.

ఇవి కూడా చదవండి

మంత్రాలయంలో రూ 10 కోట్లు నిధులతో ఏర్పాటు చేసిన 60 అడుగుల శ్రీ రాముని ఏకశిల విగ్రహంకు శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు ప్రత్యేక పూజలు చేశారు.  ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి  పాల్గొన్నారు. శ్రీరాముని పల్లకిలో ఆశీనులు చేసి గ్రామ పుర వీధుల్లో భజ భజంత్రీలు , సంస్కృతిక కార్యక్రమాలు, శ్రీ రాముని వేష ధారన, మహిళలు కలశాలతో శోభ యాత్ర సాగింది. ఈ యాత్ర తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుండి భారిగా భక్తులు తరలివచ్చారు. మంత్రాలయం జై శ్రీరామ్ నామస్మరణంతో మారు మోగింది. కుల మతాలకు అతీతంగా శ్రీ రాముని శోభ యాత్రలో ముస్లిం సోదరులు పాల్గొని జెండా ఊపి యాత్రను ప్రారంభించడం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి….

10% పనులు పూర్తయినట్లు శ్రీ మఠం పీఠాధిపతులు తెలిపారు. ఇంకా 90% పనులు పూర్తి కావాల్సిందిగా ఉందని తెలిపారు. అనంతరం మంత్రాలయం నంబర్ వన్ క్షేత్రంగా తీర్చిదిద్దుతామని శ్రీ మఠం పీఠాధిపతులు తెలియజేశారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..