Kedarnath: కేదార్‌నాథ్ ఆలయంలో 23 కిలోల బంగారం చోరీ..! ప్రభుత్వం ప్రత్యేక కమిటీతో విచారణ..

|

Jun 24, 2023 | 7:41 PM

గత సంవత్సరం సెప్టెంబర్-అక్టోబర్‌లో ఆలయ గర్భగుడిలో బంగారు తాపడం పనులు జరిగాయని త్రివేది ఆరోపించారు. బంగారు పలకలు అమర్చినట్లయితే, పాలిషింగ్ అవసరం ఏమిటి? ఈ విషయం పురావస్తు శాఖకు గానీ, యాత్రికులకు గానీ తెలియదు. ఇప్పుడు దీనిపై విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Kedarnath: కేదార్‌నాథ్ ఆలయంలో 23 కిలోల బంగారం చోరీ..! ప్రభుత్వం ప్రత్యేక కమిటీతో విచారణ..
Kedarnath Gold Plating Row
Follow us on

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేదార్‌నాథ్ ఆలయంలో 23 కిలోల గోల్డ్‌ చోరీకి గురైందని ఆరోపణలు వచ్చాయి. ఆలయానికి సమర్పించిన 23.78 కిలోల బంగారం చోరీకి గురైందని కేదార్‌నాథ్ ధామ్‌కు చెందిన తీర్థ పురోహిత్, చార్ధామ్ మహాపంచాయత్ ఉపాధ్యక్షుడు సంతోష్ త్రివేది ఆరోపించారు. ముంబైకి చెందిన ఓ వ్యాపారి విరాళంగా ఇచ్చిన బంగారాన్ని ఆలయ గర్భగుడి గోడలపై పొరలుగా వేశారు. కేదార్‌నాథ్ ఆలయ గర్భగుడిలో బంగారు అలంకరణలో ఆర్థిక అవకతవకలు జరిగాయని గతేడాది కేదార్‌నాథ్ ఆలయానికి సంబంధించిన కొందరు పూజారులు ఆరోపించారు. కానీ BKTC (బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయ కమిటీ) అటువంటి ఆరోపణలు నిరాధారమైనవని, ఇదంతా ఒకరకమైన కుట్రకోణంగా ఖండించింది. గత సంవత్సరం సెప్టెంబర్-అక్టోబర్‌లో ఆలయ గర్భగుడిలో బంగారు తాపడం పనులు జరిగాయని త్రివేది ఆరోపించారు. బంగారు పలకలు అమర్చినట్లయితే, పాలిషింగ్ అవసరం ఏమిటి? ఈ విషయం పురావస్తు శాఖకు గానీ, యాత్రికులకు గానీ తెలియదు. ఇప్పుడు దీనిపై విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

కాగా, దాత బంగారాన్ని విరాళంగా ఇచ్చాడనే అనుమానం ఉందని కాంగ్రెస్ నేత, ఉత్తరాఖండ్ మాజీ మంత్రి నవప్రభాత్ అన్నారు. విరాళంగా వచ్చిన బంగారం ఎంత? బంగారాన్ని రాగి ఎందుకు కలిపారు? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. కేదార్‌నాథ్ మాత్రమే కాదు, బద్రీనాథ్‌కు కూడా ఇలాంటి స్కామ్‌పై సమాచారం అందుతున్నదని ఆయన అన్నారు.

పెరుగుతున్న వివాదం మధ్య, ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పుడు సాంస్కృతిక, మత వ్యవహారాల కార్యదర్శి హరిచంద్ర సెమ్వాల్, గర్వాల్ కమిషనర్ నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో నిపుణులతో పాటు స్వర్ణకారులు ఉంటారని రాష్ట్ర పర్యాటక, మత, సాంస్కృతిక శాఖ మంత్రి సత్పాల్ మహరాజ్ తెలిపారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..