Breaking News
  • భారత్ దేశంలో 6 లక్షలు దాటినా కరోనా పాజిటివ్ కేసులు. గడిచిన ఐదు రోజుల్లోనే లక్ష కేసులు నమోదు. జూన్ నెలలో 4 లక్షల కేసులు,12 వేలకు పైగా మరణాలు. దేశవ్యాప్తంగా ఆరు లక్షలు దాటిన కరోనా కేసులు,18 వేలకు చేరువలో మరణాలు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 19,148 కేసులు, 434మంది మృతి. దేశవ్యాప్తంగా 6,04,641 కేసులు,17,834 మంది మృతి. దేశ వ్యాప్తంగా 2,26,947 యాక్టీవ్ కేసులు, 3,59,860 మంది డిశ్చార్జ్. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • తెలంగాణ రాష్ట్రం లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కూడా వైద్య సేవలు అందించేందుకు రంగం సిద్ధం చేసిన సర్కార్. ఇప్పటికే వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలను సందర్శించారు. ఇవ్వాల్టీ నుంచి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కరోనా పేషెంట్స్ కి చికిత్స లు అందించేంచుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం రాష్ట్రంలో 22 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో దాదాపుగా 15వేల బెడ్స్ అందుబాటులో ఉన్నాయి... వీటిల్లో చాలా వరకు ఆయా మెడికల్ కాలేజీలు కరోనా చికిత్స కోసం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా ఆస్పత్రులను కూడా కోవిడ్ సేవలకు సిద్ధం చేయాలని ఇప్పటికే ఆరోగ్య శాఖ ఆదేశాలు ఇవ్వడంతో హైదరాబాద్ లోని ఆస్పత్రులపై లోడ్ తగ్గే అవకాశం.
  • అమరావతి: సచివాలయంలో 10 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్. అసెంబ్లీలోనూ మరో ఇద్దరు ఉద్యోగులకు కరోనా నిర్ధారణ. అసెంబ్లీ, సచివాలయాల్లో మొత్తం 27 కు చేరిన కరోనా కేసులు.
  • యూపీ ఢిల్లీ హర్యానా ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించనున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. కరోనా మహమ్మారిపై సమీక్ష.
  • భారీ రూపాన్ని తగ్గించుకుంటున్న ఖైరతాబాద్ వినాయకుడు . ఈ ఏడాది 27 అడుగులకే పరిమితమైన ఖైరతాబాద్ గణేషుడు . గత ఏడాదితో పోల్చితే 38 అడుగులు తగ్గిస్తున్న విగ్రహ ఆకారం . గత ఏడాది 65 ద్వాదశాదిత్య మహా గణపతి గా పూజలు . పూర్తి మట్టి వినాయకుడు గా ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయం. 27 అడుగులతో దన్వంతరి వినాయకుడి ని ఏర్పాటు చేయనున్న ఖైరతాబాద్ వినాయక ఉత్సవ కమిటీ. భౌతిక దూరం పాటిస్తూ దర్శనాలు ఏర్పాటు చేస్తామంటున్నఖైరతాబాద్ నిర్వాహకులు. ఆన్లైన్ ద్వారా కూడా దర్శనానికి ఏర్పాట్లు . ప్రభుత్వ అనుమతి కోసం చూస్తున్నామంటున్న కమిటి.
  • ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేసిన ఏపీ. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరిన ఏపీ. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ గతంలో స్టే ఇచ్చిన హైకోర్టు.

ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన స్పైస్ జెట్ నిచ్చెన

ముంబై విమానాశ్రయంలో బలమైన ఈదురు గాలులు అతలాకుతలం చేస్తున్నాయి. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఆగివున్న ఇండిగో విమానాన్ని స్పైస్‌ జెట్‌కు చెందిన లాడర్‌ (నిచ్చెన) ఢీకొట్టింది.
Spicejet ladder crashes into parked IndiGo aircraft at Mumbai Airport, ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన స్పైస్ జెట్ నిచ్చెన

ముంబై విమానాశ్రయంలో బలమైన ఈదురు గాలులు అతలాకుతలం చేస్తున్నాయి. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఆగివున్న ఇండిగో విమానాన్ని స్పైస్‌ జెట్‌కు చెందిన లాడర్‌ (నిచ్చెన) ఢీకొట్టింది. దీంతో ఇండిగో విమానం రెక్కలు కాస్త ధ్వంసమయ్యాయి. అంతేకాదు.. ఇంజిన్‌ భాగం కూడా కాస్త దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన శనివారం ఉదయం
చోటుచేసుకుంది. ముంబైలో ఉదయం బలమైన ఈదురు గాలులు, భారీ వర్షం పడటంతో నగరమంతా తడిసిముద్దైంది. ఈ క్రమంలో బలమైన గాలుకు నిచ్చెన ఉన్న ప్రాంతం నుంచి కదలడంతో.. అది కాస్త అక్కడే పార్కింగ్ చేసి ఉన్న ఇండిగో విమానం రెక్కకి తగిలింది. అయితే ఘటన జరిగిన సమయంలో రెండు సంస్థలకు చెందిన విమానాలు అక్కడే పార్కింగ్ చేసి ఉన్నాయి.

ఇక ఇదే విషయంపై స్పైస్ జెట్ అధికారి స్పందిస్తూ.. ఉదయం 7.30 గంటలకు బలమైన గాలులు వీచాయని.. ఆ సమయంలో సంస్థకు చెందిన నిచ్చెన కదిలిపోయి.. ఇండిగో సంస్థకు చెందిన విమానం కుడివైపు రెక్కను తగిలిందని తెలిపారు.

Related Tags