దక్షిణ కొరియా నటి ‘లీ’కు ఐదేళ్ల జైలు శిక్ష!

South Korean, దక్షిణ కొరియా నటి ‘లీ’కు ఐదేళ్ల జైలు శిక్ష!

నీటిలోకి దిగి స్టంట్స్‌ చేసి, ఓ జీవిని పట్టుకోవడం వల్ల దక్షిణ కొరియాకు చెందిన నటి లీకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. ఆమె బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘ది కింగ్‌’, ‘మాన్‌స్టర్‌’ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. లీ ప్రస్తుతం ‘లా ఆఫ్‌ ది జంగిల్‌’ అనే రియాల్టీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో భాగంగా ఆమె థాయ్‌లాండ్‌లోని ఓ నేషనల్‌ పార్కులో ఏర్పాటు చేసిన షూటింగ్‌లో పాల్గొన్నారు. నీటిలోకి దిగి స్టంట్స్‌ చేసి, ఓ నీటి జీవిని పట్టుకున్నారు. నీటి నుంచి బయటికి వచ్చి.. ‘నేను పట్టుకున్నాను’ అని కేకలు పెట్టారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్‌ జూన్‌ 30న ప్రసారమైంది. దీంతో ఆమెకు వ్యతిరేకంగా థాయ్‌లాండ్‌ అధికారులు కేసు నమోదు చేశారు. అంతరించిపోతున్న ఆ నీటి జీవిని పట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తూ లీపై కేసు నమోదు చేశారు. సదరు టెలివిజన్‌ ఛానెల్‌ క్షమాపణలు కోరింది. థాయ్‌లాండ్‌ చట్టం గురించి తమకు తెలియదని పేర్కొంది. అయినా సరే పోలీసులు నటిపై కేసును వెనక్కి తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో కోర్టు ఆ నటికి రూ.44,650 జరిమానా, ఐదేళ్ల జైలుశిక్ష విధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *