Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

హైదరాబాద్​ ఓపెన్: సత్తా చాటిన ​సౌరభ్ వర్మ..టైటిల్ కైవసం

Hyderabad Open badminton: Sourabh wins title and Ashwini-Sikki finish runners-up, హైదరాబాద్​ ఓపెన్: సత్తా చాటిన ​సౌరభ్ వర్మ..టైటిల్ కైవసం

హైదరాబాద్​ ఓపెన్​లో భారత్​కు ఆదివారం మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్​ విభాగంలో సత్తా చాటిన సౌరభ్ వర్మ.. విజేతగా నిలిచి, మరో సూపర్​-100 టైటిల్​ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం 52 నిమిషాల పాటు జరిగిన తుదిపోరులో సింగపూర్​కు చెందిన లోహ్ కియాన్ యూపై 21-13, 14-21, 21-16 పాయింట్ల తేడాతో గెలుపొందాడు.
మొదటి రౌండ్​లో 6-2తో ఆధిక్యంలోకి వెళ్లిన సౌరభ్.. 11-4తో అదే ఊపు కొనసాగించి తొలి గేమ్​ సాధించాడు. రెండో రౌండ్​​లో ఇద్దరూ క్రీడాకారులు నువ్వా నేనా అంటూ ఆడారు. చివరికి విజయం ప్రత్యర్థినే వరించింది. నిర్ణయాత్మక మూడో రౌండ్​లో దూకుడుగా ఆడిన వర్మ..ఆ గేమ్​ను సొంతం చేసుకున్నాడు.గత సంవత్సరం డచ్ ఓపెన్, రష్యన్ ఓపెన్‌ సూపర్ 100 టైటిల్స్ గెలుచుకున్నాడు సౌరభ్ వర్మ. ఈ ఏడాది మేలో జరిగిన స్లోవేనియన్ ఇంటర్నేషనల్​లో విజేతగా గెలిచాడు.

మహిళా డబుల్స్​లో టాప్ సీడ్ భారత జోడి అశ్విని పొన్నప్ప- సిక్కి రెడ్డి.. ఈ విభాగంలో తొలి టైటిల్ కొట్టే అవకాశం కొద్దిలో కోల్పోయారు.​ కొరియన్ ద్వయం బేక్ హ నా- జుంగ్ క్యూంగ్ యన్ చేతిలో 17-21,17-21 పాయింట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.