బాలీవుడ్ నటుడు సోనూ సూద్ చట్ట ఉల్లంఘనుడు, బాంబే హైకోర్టులో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అఫిడవిట్

బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తరచూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బాంబే హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్..

  • Umakanth Rao
  • Publish Date - 12:05 pm, Wed, 13 January 21

బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తరచూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బాంబే హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో ఆరోపించింది. ముంబై శివార్లలోని జుహులో ఓ రెసిడెన్షియల్ భవనానికి  కట్టిన అక్రమ నిర్మాణాలను తమ సిబ్బంది ఎన్నోసార్లు కూల్చివేసినా వాటిని చట్ట విరుధ్ధంగా  మళ్లీమళ్లీ నిర్మిస్తున్నాడని ఈ కార్పొరేషన్ పేర్కొంది. తనకు ఈ సంస్థ జారీ చేసిన నోటీసును సవాలు చేస్తూ సోనూ సూద్ కోర్టులో పిటిషన్ వేయగా దానిపై కార్పొరేషన్ అఫిడవిట్ సమర్పించింది. అనధికారిక నిర్మాణాలను  లోగడ రెండు సార్లు కూల్చివేసినప్పటికీ తిరిగి సూద్ ఇలా పునర్నిర్మించాడని అధికారులు తెలిపారు.శక్తి సాగర్ అనే ఆరంతస్థుల బిల్డింగ్ ని కమర్షియల్ హోటల్ గా మారుస్తున్నాడని, లైసెన్స్ లేకపోయినా నిబంధనలను అతిక్రమించి ఆయన ఇలా చట్ట వ్యతిరేకిగా మారాడని బీర్హాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆరోపించింది. నిజానికి రెసిడెన్షియల్ బిల్డింగును హోటల్ గా మార్చడానికి వీలు లేదని పేర్కొంది. పైగా తాము తనను వేధిస్తున్నారని నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని కూడా తెలిపింది. ఈ భవనానికి తాను గానీ, తన భార్య గానీ సొంత యజమానులమని నిరూపించే డాక్యుమెంట్లు ఏవీ చూపలేదని  కూడా వెల్లడించింది.

అయితే లోగడ కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో వలస  కార్మికులను వారి స్వస్థలాలకు తరలించే సమయంలో సోనూ సూద్ వారికి ఎంతో సాయం చేశాడు.

Also Read:

Centre Advisory on Bird Flu: దేశంలో రోజు రోజుకీ వ్యాపిస్తున్న బర్ద్ ఫ్లూ.. మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

పాలమూరులో అంతర్జాతీయ ఎయిర్‌ షో, పారామోటార్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు.. ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్

సీరం తరువాత ఇక భారత్ బయో టెక్, దేశంలోని వివిధ నగరాలకు తరలిన కొవాగ్జిన్ వ్యాక్సిన్, ఢిల్లీకి ఎయిరిండియా విమానంలో..