Centre Advisory on Bird Flu: దేశంలో రోజు రోజుకీ వ్యాపిస్తున్న బర్ద్ ఫ్లూ.. మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

దేశంలో రోజు రోజుకీ బర్డ్ ఫ్లూ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏవియన్‌ ఫ్లుయెంజా నమూనాల పరీక్షలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. అత్యవసరమైన పరిస్థితులలో…

  • Surya Kala
  • Publish Date - 11:35 am, Wed, 13 January 21

Centre Advisory on Bird Flu: దేశంలో రోజు రోజుకీ బర్డ్ ఫ్లూ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏవియన్‌ ఫ్లుయెంజా నమూనాల పరీక్షలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. అత్యవసరమైన పరిస్థితులలో పక్షుల కల్లింగ్ కు తగిన ఏర్పాట‌్లు చేసుకోవలని కేంద్రం సూచించింది,
దేశంల ఇప్పటి వరకూ పది రాష్ట్రాల సహా కేంద్రపాలిత ప్రాంతల్లో కూడా బర్డ్ ఫ్లూ వ్యాపించింది.

ఉత్తర్‌ప్రదేశ్‌, కేరళ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, హరియాణా, గుజరాత్‌ ,ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ ల్లో ఇప్పటి వరకూ ఈ వైరస్ జాడలు కనిపించాయి. తాజాగా ఝార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్ లో పలు చోట్ల పక్షులు మృతి చెందాయి. దీంతో ప్రజల్లో భయాందోళనను వ్యక్తమవుతున్నాయి.  ఉత్తరా ఖండ్‌లో గత కొన్నిరోజులుగా దాదాపు 300 పక్షులు మృత్యువాత పడ్డాయి. రాజస్థాన్‌లోని ఝున్‌ఝనూ జిల్లా హెచ్‌సీఎల్‌ , ఖేత్రి నగర్‌లో మృతిచెందిన కాకులతో హెచ్‌5ఎన్‌8 వైరస్ ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పరిస్థితులను పరిశీలిస్తున్న కేంద్ర బృందాలు.. తాజాగా మహారాష్ట్ర, గుజరాత్‌లకు వెళ్లనున్నాయి.

యూపీలోని పలు ప్రాంతాల్లో బర్ద్ ఫ్లూ వెలుగులోకి వచ్చింది. కాన్పుర్‌ జూ పక్షుల్లో బర్డ్‌ఫ్లూ లక్షణాలు బయటపడ్డాక తాజాగా బుందేల్‌ఖండ్‌ ప్రాంతానికి చెందిన హమిర్‌పుర్‌, చిత్రకూట్‌, బాందా జిల్లాల్లో ఈ వైరెస్ జాడలు కనిపించాయి. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. హమిర్‌పుర్‌ జిల్లా భారువా సుమేర్‌పుర్‌ రైల్వేస్టేషను సమీపంలో కొన్ని కొంగలు, కాకులు మృతిచెందగా.. నమూనాలు పరీక్షలకు పంపారు. చిత్రకూట్‌ జిల్లాలో 200 కోళ్లను పూడ్చిపెట్టారు. బర్డ్‌ఫ్లూ పర్యవేక్షణకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. బాందా జిల్లాలోకి బయటి ప్రాంతాల నుంచి గుడ్లు, కోళ్లు రాకుండా సరిహద్దు పోలీస్‌స్టేషన్లను అప్రమత్తం చేశామని ఏఎస్పీ మహేంద్ర ప్రతాప్‌ చౌహాన్‌ తెలిపారు.

మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లా కోళ్ల ఫారంలోని కడక్‌నాథ్‌ జాతి కోళ్లకు సైతం బర్డ్‌ఫ్లూ సోకింది. బాగా ఎక్కువ ధరకు విక్రయించే వీటిని వినోద్‌ మేదా అనే యజమాని ఫాం నుంచి 550 కోళ్లు, 2,800 కోడిపిల్లలను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని పూడ్చిపెట్టారు. మరోవైపు బర్ద్ ఫ్లూ మహారాష్ట్ర లో దేశ ఆర్ధిక రాజధాని ముంబై ని వణికిస్తుంది. తాజాగా 55 చోట్ల పక్షులు మరణించడంతో బీఎంసీ అధికారులు హెల్ప్‌లైన్‌ నంబరు ఏర్పాటు చేశారు. లాతూర్‌ జిల్లా కేంద్రవాది, సుక్ని గ్రామాల కోళ్ల నుంచి సేకరించిన నమూనాల్లో బర్డ్‌ఫ్లూ పాజిటివ్‌ రావడంతో.. ఈ రెండు గ్రామాలకు ఒక కిలోమీటరు పరిధిలో కోళ్లు, పక్షులను సంహరించాలంటూ జిల్లా కలెక్టర్‌ బి.పి.పృథ్వీరాజ్‌ ఆదేశాలు జారీ చేశారు. లాతూర్‌ మహారాష్ట్రలో బర్డ్‌ఫ్లూ కేసులు బయటపడిన మూడో జిల్లా. ఈ రెండు గ్రామాల్లో 4 వేలు, పర్భానీ జిల్లాలోని మురుంబా గ్రామంలో 5,500 కోళ్లను అధికారులు పూడ్చిపెట్టారు.

Also Read: తెలంగాణాలో నిలకడగా కరోనా కేసులు నమోదు .. గత 22 గంటల్లో 331 కొత్త కేసులు నమోదు