సీరం తరువాత ఇక భారత్ బయో టెక్, దేశంలోని వివిధ నగరాలకు తరలిన కొవాగ్జిన్ వ్యాక్సిన్, ఢిల్లీకి ఎయిరిండియా విమానంలో..

:భారత్ బయో టెక్ సంస్థ ఉత్పత్తి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ బుధవారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి రవాణా అయింది..

  • Umakanth Rao
  • Publish Date - 11:24 am, Wed, 13 January 21

 భారత్ బయో టెక్ సంస్థ ఉత్పత్తి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ బుధవారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి రవాణా అయింది. ఢిల్లీతో బాటు దేశంలోని సుమారు 10 నగరాలకు ఈ వ్యాక్సిన్ ని తరలించారు. మొదట ఎయిరిండియా విమానంలో  ఢిల్లీకి కొవాగ్జిన్ బాక్సులు వెళ్లగా ఆ తరువాత వివిధ ట్రక్కుల్లో ఆయా నగరాలకు రవాణా చేశారు. 80.5 కేజీల బరువైన మూడు బాక్సులను తొలి కన్ సైన్ మెంట్ లో ఢిల్లీ నగరానికి తరలించినట్టు భారత్ బయో టెక్ కంపెనీ వర్గాలు తెలిపాయి. బెంగుళూరు, పాట్నా, జైపూర్, లక్నో తదితర సిటీలకు ఈ  వ్యాక్సిన్ వెళ్ళింది .55 లక్షల కొవాగ్జిన్ డోసులు, సీరం వారి 1.1 కోట్ల కొవిషీల్డ్ డోసులను తాము ప్రొక్యూర్ చేసినట్టు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు వ్యాక్సిన్లను అత్యవసర వినియోగం కోసం భారత రెగ్యులేటరీ అనుమతించింది. భారత్ బయో టెక్ సంస్థ డోసుకు 295 రూపాయలు వసూలు చేయనున్నట్టు తెలుస్తోంది. మొత్తం 38.5 లక్షల డోసుల్లో ఈ సంస్థ కేంద్రానికి ఉచితంగా 16.5 లక్షల డోసులను అందజేయనుంది.

Also Read:

డొనాల్డ్ ట్రంప్ అభిశంసన కోసం 25 వ సవరణ ప్రతిపాదనకు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తిరస్కృతి, యూ టర్న్ తీసుకున్నట్టేనా

Sehwag Funny Comment : ఆస్ట్రేలియా వెళ్లేందుకు నేను రెడీ.. సెహ్వాగ్ బాబా మళ్లీ పేల్చాడు..

వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 24మందికి గాయాలు.. ఆరుగురి పరిస్థితి విషమం..!