పాలమూరులో అంతర్జాతీయ ఎయిర్‌ షో, పారామోటార్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు.. ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్

మహమూబ్‌నగర్‌లో అంతర్జాతీయ ఎయిర్‌ షో, పారామోటార్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

  • Balaraju Goud
  • Publish Date - 11:30 am, Wed, 13 January 21

International air show : అంతర్జాతీయ ఎయిర్‌ షో, పారామోటార్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహమూబ్‌నగర్‌లో జరగుతున్న పోటీలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర పర్యాటక శాఖ, వరల్డ్‌ అడ్వెంచర్స్‌, ఎయిర్‌ స్పోర్ట్స్‌ ఎయిర్‌ షో నిర్వహిస్తున్నారు. ఎయిర్‌ షోలో భాగంగా హాట్‌ ఎయిర్‌ బెలూన్‌, స్కై డైవింగ్‌, పారా మోటార్‌ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి.

హర్యానా, పంజాబ్‌, ఢిల్లీ, తమిళనాడు, కేరళ, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాలకు చెందిన 11 మంది పారా మోటర్‌ పైలెట్లు పాల్గొంటున్నారు. ఆరు టాస్క్‌లలో పోటీల నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఐదు రోజుల పాటు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోటీలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే తొలి ఎయిరో స్పోర్ట్స్‌ శిక్షణ కేంద్రం పాలమూరుకు తరలిరానున్నట్లు మంత్రి తెలిపారు. కరివేన-ఉద్ధండాపూర్‌ రిజర్వాయర్ల మధ్య ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దడంలో ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందన్నారు,

ఇదీ చదవండి… Petrol and Diesel Prices : మరోసారి స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. 5 రోజుల తర్వాత రూ.0.25 ఫైసలు పెంపు