Breaking News
  • సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత. సోమాజిగూడ యశోధ ఆస్పత్రిలో చికిత్స. కొంతకాలంగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న నర్సింగ్‌ యాదవ్‌.
  • తెలంగాణలో ఇవాళ కొత్తగా 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. తెలంగాణ లో ఇప్పటి వరకు 471కరోనా పాజిటివ్ కేసులు . ఇప్పటి వరకు మొత్తం 12 మంది మృతి చెందారు. పాజిటివ్ కేసుల నుంచి 45 మందికోలుకుని..డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 412 యాక్టీవ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి.
  • ఈ రోజుతో మార్కస్ కు వెళ్లిన వారితో పాటు 665 టెస్టులు చేస్తే 18 మాత్రమే . 385 మంది మార్కస్ కాంటాక్ట్స్. 45 మంది డిశ్చార్జ్. మొత్తం 414 మంది ట్రీట్మెంట్స్ పొందుతున్నారు. తెలంగాణలో 1ఒక్కరు మాత్రమే వెంటిలేటర్ పై ఉన్నారు. 22 కళ్ళ అందరూ డిశ్చార్జ్ అవుతారు.
  • లాక్‌డౌన్‌తో చుక్కేసుకుంటే కానీ చక్కగా ఉండలేని మందుబాబులకు చుక్కలు కనిపిస్తున్నాయి.. బ్లాక్‌లో వేలకు వేలు పోసి లిక్కర్‌ బాటిళ్లు కొనుక్కుంటున్నారు. అంత డబ్బు పెట్టలేని సామాన్యులు మాత్రం పిచ్చేక్కిపోతున్నారు. ఎప్పుడెప్పుడు వైన్‌షాపులు తెరచుకుంటాయా అని ఎదురుచూస్తున్నారు.
  • నిజామాబాద్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నది. తాజాగా మరో ఎనిమిది కేసులు నమోదు అయ్యాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం.

సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తోన్న “మహా” సర్కార్..!.. “మోదీ”కి చెక్ పెట్టేందుకేనా..?

Singing national anthem mandatory in Maharashtra colleges from February 19, సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తోన్న “మహా” సర్కార్..!.. “మోదీ”కి చెక్ పెట్టేందుకేనా..?

మహారాష్ట్రలో అనూహ్యంగా కాంగ్రెస్, ఎన్సీపీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఉద్దవ్ థాక్రే.. పలు కీలక నిర్ణాయాలు తీసుకుంటూ దూసుకెళ్తున్నారు. ఇప్పటికే పది రూపాయలకే పేదలకు భోజన పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇక తాజాగా మరిన్ని సంచనల నిర్ణయాలు తీసుకున్నారు సీఎం ఉద్దవ్ థాక్రే. అయితే ఈయన తీసుకున్న నిర్ణయాలు చూస్తే.. దేశభక్తికి కేరాఫ్ అని చెప్పుకునే బీజేపీ సర్కార్‌కు చెక్ పెట్టేలా ఉన్నట్లు అర్ధమవుతోంది. రాష్ట్రంలో మరాఠా వాదాన్ని చూపుతూ.. ప్రజల్ని ఆకర్షించేలా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Singing national anthem mandatory in Maharashtra colleges from February 19, సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తోన్న “మహా” సర్కార్..!.. “మోదీ”కి చెక్ పెట్టేందుకేనా..?

రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో మరాఠి భాషను తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే సమయంలో.. అన్ని కళాశాలల్లో నిత్యం జాతీయగీతాలాపన తప్పనిసరి చేస్తూ.. కీలక నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఈ నెల ఫిబ్రవరి 19న శివాజీ జయంతి సందర్భంగా ఈ ఆదేశాలు అమలులోకి రానున్నాయి. ఇక నుంచి ప్రతి రోజూ ఉదయం అన్ని కాలేజీల్లో తరగతులు ప్రారంభించటానికి ముందు.. జాతీయ గీతం ఆలాపించేలా ఆదేశాలు జారీ చేసినట్లు ఆ రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి ఉదయ్ సామంత్ తెలిపారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను.. ఫిబ్రవరి 19 వరకు అన్ని కాలేజీలకు పంపనున్నట్లు వెల్లడించారు. అంతేకాదు.. ఈ నియమాన్ని పాటించేందుకు కాలేజీలు కూడా రెడీ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో నిత్యం రాష్ట్రంలోని 15 లక్షల మంది కళాశాల విధ్యార్ధులు జాతీయ గీతాలాపన చేయనున్నారని.. ఇది దేశంలోనే రికార్డు కాబోతుందన్నారు. ఇప్పటి వరకు దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. విద్యార్థుల్లో దేశ భక్తి, జాతీయ భావాలను పెంపొందించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు.

Singing national anthem mandatory in Maharashtra colleges from February 19, సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తోన్న “మహా” సర్కార్..!.. “మోదీ”కి చెక్ పెట్టేందుకేనా..?

మరోవైపు ప్రభుత్వోద్యుగులకు కూడ గుడ్ న్యూస్ ప్రకటించింది. ఇక నుంచి వారానికి ఐదు రోజులే పనిదినాలని తెలిపింది. వారానికి రెండు రోజులు సెలవులను ప్రకటించింది. ఫిబ్రవరి 29 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. ముంబైలో సీఎం ఉద్దవ్ థాక్రే నేతృత్వంలో జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఈనిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రభుత్వోద్యుగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Singing national anthem mandatory in Maharashtra colleges from February 19, సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తోన్న “మహా” సర్కార్..!.. “మోదీ”కి చెక్ పెట్టేందుకేనా..?

Related Tags