Breaking News
  • ఇంద్రకీలాద్రి: నేటి నుంచి ఇంద్రకీలాద్రి పై దసరా‌ శరన్నవరాత్రి మహోత్సవాలు. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దర్శనమివ్వనున్న దుర్గమ్మ . ఉత్సవాల్లో భాగంగా ఇవ్వాళ స్వర్ణకవచాలంక్రుత దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శమనివ్వనున్న దుర్గమ్మ. 9 గంటల నుంవి అమ్మవారి దర్శనార్ధం భక్తులకు అనుమతి . కోవిడ్‌ ద్రుష్ట్యా రోజుకు పది వేల మంది భక్తులకు మాత్రమే కొండపైకి అనుమతి . స్లాట్ లేని భక్తులకు అనుమతి నిరాకరణ . వినాయకుని గుడి నుంచి అమ్మవారి సన్నిధానం వరకు నాలుగు క్యూలైన్లు ఏర్పాటు. ప్రత్యక్ష పూజలకు అనుమతి నిరాకరణ..పరోక్షంగా జరిగే పూజలను వీడియోస్ ద్వారా వీక్షించే అవకాశం . ఉత్సవాలకు నాలుగు వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు.
  • సిద్దిపేట; టీవీ9తో కత్తి కార్తీక (దుబ్బాక ఇండిపెండెంట్ అబ్యర్థి) రాజకీయ కక్షతోనే నాపై కేసులు నమోదు అవుతున్నాయి. అమిన్ పూర్ ల్యాండ్ ఇష్యూలో నేను ఎవరిని మోసం చేయలేదు. సదరు వ్యక్తికి రెండు నెలల క్రితమే లీగల్ నోటీసులు పంపించాను.. మరి ఇప్పుడు పోలీసులు నాపై కేసు ఎలా నమోదు చేస్తారు. నా పైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లు కేసు నమోదు అయినట్టు నాకు సమాచారం లేదు.. మీడియా ద్వారానే నాకు తెలిసింది. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా నేను రాజకీయాలను వీడను.. 2023లో కూడా దుబ్బాక నుండే పోటీ చేస్తా. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధిలో చాలా వెనుకబడింది.
  • నాలుగో రోజు వరుసగా వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రి కెటి రామారావు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్థిక సహాయాన్ని అందించిన పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు. రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో వరదల్లో చనిపోయిన పలువురికి ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెక్కులను అందించిన మంత్రి కేటీఆర్. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏంపిలు రంజిత్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ మంత్రి వెంట ఉన్నారు వరదల వలన ప్రాణ నష్టం జరగడం బాధాకరం.... ప్రాణ నష్టం అరీకట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నించింది.
  • రాజేంద్రనగర్ గగన్పహాడ్ వద్ద ఉన్న అప్ప చెరువు ని పరిశీలించిన మంత్రి కేటీఆర్. మొన్నటి భారీ వర్షాలకు అప్ప చెరువు తెగి పెద్ద ఎత్తున జనావాసాల వరదకు కారణమై న అప్ప చెరువు. సాగునీటి శాఖ తో సమన్వయం చేసుకొని వెంటనే చెరువుకట్ట కు తగిన మరమ్మతులు చేయాలని సూచించిన మంత్రి. చెరువు లో వెలసిన ఆక్రమణలు ఏవైనా ఉంటే వాటిని తొలగించాలని స్థానిక రెవెన్యూ అధికారుల కి ఆదేశం.
  • ప.గో: వివాహితను వేధిస్తోన్న ఐదుగురిపై కేసు నమోదు. మహిళ స్నానం చేస్తుండా సెల్‌ఫోన్‌లో వీడియో తీసిన యువకుడు. వీడియోను తన స్నేహితులకు పంపించిన యువకుడు. వీడియో అడ్డంపెట్టుకొని మహిళకు యువకుల వేధింపులు. కామవరపుకోట మండలం వీరంపాలెంలో ఘటన. బాధితురాలి ఫిర్యాదుతో ఐదుగురిపై కేసు నమోదు.
  • విశాఖ: పోలీస్ కస్టడీకి నూతన్ నాయుడు . చీటింగ్ కేసులో నూతన్ నాయుడును కస్టడీకి తీసుకున్న ఎమ్మార్ పేట పోలీసులు. దళిత యువకుడికి ఉద్యోగమిప్పిస్తానని మోసం చేసినట్టు అభియోగం.. మహారాణిపేట పీఎస్ లో కేసు. విచారించి జ్యుడీషియల్ కస్టడీకి నూతన్ నాయుడు ను అప్పగించిన పోలీసులు.
  • Tv9 తో మంత్రి శ్రీనివాస్ గౌడ్: టీవీ9 స్టింగ్ ఆపరేషన్ ను అభినందించిన ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్. టీవీ9 సాహసోపేత ఆపరేషన్ నిర్వహించింది. పోలీసులే కాదు మీడియా సంస్థలు కూడా ఇలాంటి అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా చేయాలి. టీవీ9 అందించిన సమాచారాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నాం. చెక్ పోస్టులను కట్టుదిట్టం చేయడానికి త్వరలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తా. హైదరాబాదులో డ్రగ్స్ సరఫరా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. ఎంత వారైనా, ఎంత పలుకుబడి ఉన్న శిక్ష తప్పదు. కొంత మంది ఆన్లైన్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. సైబర్ క్రైమ్ సహకారంతో వారి ఆట కట్టిస్తున్నాం. తెలంగాణ వచ్చాక పేకాట క్లబ్ ల నుంచి గంజాయి వరకు అన్ని బందు చేశాం. దేశవ్యాప్తంగా డ్రగ్స్ పై ఉమ్మడి కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉంది.

నితిన్ పవర్ పేటలో కీలక పాత్రలో సత్యదేవ్‌..!

టాలీవుడ్‌ యువ హీరో నితిన్‌ వరుస సినిమాలను లైన్‌లో ఉంచుకున్నారు. ప్రస్తుతం రంగ్‌దేతో పాటు చెక్‌లో నటిస్తోన్న ఈ నటుడు.. ఆ తరువాత మేర్లపాక గాంధీ, కృష్ణ చైతన్య డైరెక్షన్‌లలో నటించనున్నారు.

Nithiin Power Peta, నితిన్ పవర్ పేటలో కీలక పాత్రలో సత్యదేవ్‌..!

Nithiin Power Peta: టాలీవుడ్‌ యువ హీరో నితిన్‌ వరుస సినిమాలను లైన్‌లో ఉంచుకున్నారు. ప్రస్తుతం రంగ్‌దేతో పాటు చెక్‌లో నటిస్తోన్న ఈ నటుడు.. ఆ తరువాత మేర్లపాక గాంధీ, కృష్ణ చైతన్య డైరెక్షన్‌లలో నటించనున్నారు. అయితే ఈ ఇద్దరు దర్శకులు తెరకెక్కించే చిత్రాలు రీమేక్‌లు కావడం విశేషం. మేర్లపాక గాంధీ అంధధూన్‌ రీమేక్‌కి దర్శకత్వం వహిస్తుండగా.. కృష్ణ చైతన్య పుదుపెట్టైని రీమేక్ చేస్తున్నారు. ఈ రెండింటికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే పుదుపెట్టై రీమేక్‌లో నితిన్ సరసన కీర్తి సురేష్‌ మరోసారి రొమాన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోయే ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం టాలెంటెడ్‌ నటుడు సత్యదేవ్‌ని సంప్రదించినట్లు సమాచారం. ఓ వైపు హీరోగా చేస్తూనే మరోవైపు పలువురు హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు సత్యదేవ్‌. ఈ క్రమంలోనే పవర్‌ పేటలో ఓ పవర్‌ఫుల్ పాత్రలో సత్యదేవ్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే పవర్‌పేటకు సత్యదేవ్‌ మరో అదనపు ఆకర్షణ అవ్వనున్నారు.

Read More:

డ్రగ్స్ కేసు: ప్రముఖ నటుడి భార్యకు సమన్లు.. విచారణకు గైర్హాజరు

హీరో రాజశేఖర్ ఇంట్లో అందరికీ కరోనా పాజిటివ్

Related Tags