‘మోదీజీ ! ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొడతారా’ ? రాహుల్ ధ్వజం

మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మొదటిసారిగా స్పందించారు. ఒక రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రధాని మోదీ యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

'మోదీజీ ! ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొడతారా' ? రాహుల్ ధ్వజం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 11, 2020 | 1:02 PM

మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మొదటిసారిగా స్పందించారు. ఒక రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రధాని మోదీ యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్టీకి సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా చేసిన రాజీనామా గురించి ప్రస్తావించకుండా.. రాహుల్.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొదట దేశ ఆర్ధిక పరిస్థితిపై దృష్టి నిలపాలని కోరారు. ఆయిల్ ధరలు తగ్గించాలని సూచించారు. గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు సుమారు 35 శాతం పడిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజల చేత ఎన్నికైన ఒక ప్రభుత్వాన్ని అస్థిర పరచడంలో ప్రధాని బిజీగా ఉన్నారని, అయితే చమురు ధరలు పడిపోతున్న విషయం బహుశా మీ దృష్టికి రాకపోయి ఉండవచ్ఛునని వ్యంగ్యంగా పేర్కొన్నారు. దేశంలో పెట్రోలు లీటరుకు 60 రూపాయల చొప్పున తగ్గించి ఈ ప్రయోజనాన్ని దేశ ప్రజలకు అందజేయాలని ఆయన ట్వీట్ చేశారు. స్తంభించిన ఎకానమీని పునరుధ్ధరించేందుకు కృషి చేస్తారా అని రాహుల్ ప్రశ్నించారు.

అయితే జ్యోతిరాదిత్య సింధియా… కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, తన తల్లి సోనియా గాంధీకి పంపిన రాజీనామాలేఖపైన గానీ, ఆయనకు బీజేపీ రాజ్యసభ సభ్యత్వం, కేంద్ర మంత్రి పదవి ఇవ్వజూపుతున్నట్టు వస్తున్న వార్తలపై గానీ రాహుల్ మాట మాత్రమైనా ప్రస్తావించలేదు. కానీ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మాత్రం బహుశా ఆ బాధ్యతను చేపట్టినట్టు కనిపిస్తోంది. సింధియా పట్ల పార్టీ ఎలాంటి నిర్లక్ష్యం చూపలేదని, ఆయన మాటలకు ఎప్పుడూ విలువనిస్తూ వస్తోందని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో