Breaking News
  • కరోనా మహమ్మారిపై యుద్ధంలో భాగంగా దేశ ప్రజలంతా రేపు రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు లైట్లు ఆర్పేసి ఇంట్లో దీపాలు వెలిగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు దేశ వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. సెలబ్రిటిలు కూడా ప్రధాని పిలుపుకు స్పందిస్తున్నారు.
  • మందు తాగితే తూలడం, మందు లేకపోతే మతిస్థిమితం కోల్పోయినట్టుగా ప్రవర్తించడం.. ఇదే ఇప్పుడు అంతటా కనిపిస్తోంది.. కరోనా కాలంలో మందుబాబుల కష్టాలు అన్నీఇన్నీ కావు.. మద్యం దుకాణాలన్నీ బంద్‌.. బార్లు పబ్బులు బంద్‌.. తాగి తాగి పిచ్చెక్కిపోయిన మందుబాబులు చివరకు దొంగలుగా మారిపోయారు.
  • తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వెల్లూరు, తేంగాశి, కల్లకురిచి జిల్లాలలో పెరుగుతోన్న కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. తమిళనాడులో 411 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వారిలో 64 మంది నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారే కావడం గమనార్హం.
  • కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంటి నుంచి బయటకు వెళితే మాస్క్‌ తప్పనిసరిగా వాడాలని కేంద్రం తెలిపింది. ఈ నియమాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిందనని రాష్ట్ర ప్రభుత్వాలను, పోలీసు శాఖలను ఆదేశించింది.
  • లాక్‌డౌన్‌ను అతిక్రమిస్తే కఠిన చట్టాలు అమలు చేస్తామని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌. అనవసరంగా రోడ్డు మీదకొస్తే వాహనాలు సీజ్‌ చేస్తామన్నారు.

ప్రభాస్ నెక్ట్స్ మూవీ ఆ డైరక్టర్‌తోనేనా..!

Prabhas next movie Director, ప్రభాస్ నెక్ట్స్ మూవీ ఆ డైరక్టర్‌తోనేనా..!

ఇటీవల సాహోతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్.. ఆ మూవీతో అందరి అంచనాలను అందుకోలేకపోయాడు. ప్రస్తుతం ఈ హీరో జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో జాన్(అనధికార టైటిల్)మూవీలో నటిస్తున్నాడు. పీరియాడిక్ రొమాంటిక్ లవ్‌ స్టోరీగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రంలో పూజా హెగ్డే మొదటిసారిగా ప్రభాస్ సరసన ఆడిపాడుతోంది. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Prabhas next movie Director, ప్రభాస్ నెక్ట్స్ మూవీ ఆ డైరక్టర్‌తోనేనా..!

ఇక ఈ మూవీ తరువాత ప్రభాస్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన సైరా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌ను తెచ్చుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమాలో సురేందర్ రెడ్డి టేకింగ్‌కు మంచి మార్కులు పడగా.. విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. దీంతో అతడి దర్శకత్వంలో నటించేందుకు ప్రభాస్ చాలా ఆసక్తిని చూపిస్తున్నాడట. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సురేందర్ రెడ్డి ప్రభాస్ కోసం కథను రెడీ చేశాడని.. దానికి అతడి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే.. త్వరలోనే ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారని టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Related Tags