Breaking News
  • రోజురోజుకీ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమయ్యింది. గడచిన 24 గంటల్లోనే 438 మంది వైరస్‌ బారిన పడ్డారంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులకు పది ప్రాంతాలు డేంజర్‌ స్పాట్స్‌గా ఉన్నాయని కేంద్రం ప్రకటించింది.
  • అసలే జనం భయంతో బతికేస్తున్నారు. ఈ టైమ్‌లో కరోనాపై అవాకులు చవాకులు పేల్చేవాళ్లు ఎక్కువయ్యారు. కొందరు ఫేక్‌ న్యూస్‌ పోస్టు చేస్తుంటే కొందరు విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై, వైద్యులపై ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మొత్తం రాష్ట్ర పరిస్థితిని ఆరా తీస్తున్నారు.
  • ఏలూరులో ఒక్కసారిగా ఎనిమిది కరోనా పాజిటివ్‌ కేసులు తెరమీదకు వచ్చాయి. ఇంకెన్ని ఉంటాయోనని ప్రజలు భయపడుతుంటే అలాంటి హై రిస్క్‌ జోన్‌లో నిరంతరం పని చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం సిటీలో 144 సెక్షన్‌ అమలవుతోంది. కుటుంబాలకు దూరంగా రెడ్‌జోన్‌లో పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు.
  • ప్రతీది కరోనా కాదు.. పొడిదగ్గు తుమ్ములు ఉంటే వాయుకాలుష్యం. దగ్గు, తెమడ, ముక్కు కారడం, తుమ్ములు వస్తే జలుబు. దగ్గు, తెమడ, తుమ్ములు, ముక్కు కారడం, ఒంటి నొప్పులు, బలహీనత, తేలికపాటి జ్వరం ఫ్లూ లక్షణాలు. పొడిదగ్గు, తుమ్ములు, ఒంటి నొప్పులు, అధిక జ్వరం, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇవన్నీ కొవిడ్‌-19 లక్షణాలు. ప్రతీది కరోనా కాదు.. కంగారు పడొద్దు..
  • నిజాముద్దీన్ మర్కజ్ కేసులో ఢిల్లీ క్రైం బ్రాంచ్ నోటీసులు. తబ్లీఘీ-జమాత్ చీఫ్ మౌలానా సాద్ సహా 7గురు నిందితులకు నోటీసులు. నిబంధనలు ఎందుకు అతిక్రమించారో రాతపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశం. నిందితుల ఇళ్లకు నోటీసులు పంపించిన క్రైం బ్రాంచ్.

లాక్‌డౌన్ ఎఫెక్ట్.. పెరుగుతున్న పోర్న్ సర్చింగ్.. ఏ ఏ సైట్స్ చూస్తున్నారంటే..?

Porn demand Rises 20 Percent in india during Lockdown, లాక్‌డౌన్ ఎఫెక్ట్.. పెరుగుతున్న పోర్న్ సర్చింగ్.. ఏ ఏ సైట్స్ చూస్తున్నారంటే..?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు వారాలపాటు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఇంట్లోకెళ్లి బయటకు వెళ్తే.. పలుచోట్ల పోలీసులు కుమ్మేస్తున్నారు. దీంతో మెజార్టీ ప్రజలు ఇళ్లలోనే గడిపేస్తున్నారు. దీంతో ఇంట్లో ఉంటున్న మనోళ్లు.. గత నాలుగైదు రోజులుగా.. పోర్న్ సైట్లు చూస్తు రెచ్చిపోతున్నారట. ఎక్కువ మంది పోర్న్ వీడియోలనే వీక్షిస్తున్నట్లు ఓ సంస్థ ప్రకటించింది. ముఖ్యంగా “దేశీ పోర్న్‌” కంటెంట్‌ కోసం అనేక సైట్లతో పాటు సర్చ్ ఇంజన్లలో విపరీతంగా వెతుకుతున్నారట. ఓ అడల్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ సేకరించిన వివరాల ప్రకారం.. గత ఫిబ్రవరి నెలలో పోర్న్‌ సైట్ల డైలీ ట్రాఫిక్‌తో పోల్చితే.. ఇప్పుడు మార్చిలో 20శాతంకు పైగా పెరిగిందట. ముఖ్యంగా గత వారం నుంచి మరీ ఎక్కువగా ట్రాఫిక్ పెరిగినట్లు ఆ సంస్థ తెలిపింది.

కాగా.. ఇండియాలో దాదాపు 857 పోర్న్ సైట్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ సర్వీస్ లేదా మిర్రర్ సైట్స్ ద్వారా పోర్న్ సైట్స్‌లోకి ఎంటర్ అయ్యి.. వీడియోలను చూస్తున్నారట.

Related Tags