సింహం సింగిల్‌గానే వస్తుంది, వైసీపీ కూడా అంతేః షర్మిళ

| Edited By: Pardhasaradhi Peri

Apr 05, 2019 | 5:18 PM

మంగళగిరి: సింహం సింగిల్‌గానే వస్తుంది అన్నట్టు వైసీపీ కూడా ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల బరిలో నిలిచిందని వైస్ షర్మిళ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వైసీపీ ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. ప్రజలకు మంచి చేయాలంటే జగన్ అధికారంలోకి రావాలని అన్నారు. చెప్పింది చేసేవాడు కావాలంటే, రాజన్న రాజ్యం కావాలంటే, వెన్నుపోటు చంద్రబాబు పోవాలంటే తమ పార్టీకి ఒక్కసారి అవకాశమిచ్చి గెలిపించాలని చెప్పారు. జగన్‌ని ముఖ్యమంత్రిని చేయాలని, ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు బై బై […]

సింహం సింగిల్‌గానే వస్తుంది, వైసీపీ కూడా అంతేః షర్మిళ
Follow us on

మంగళగిరి: సింహం సింగిల్‌గానే వస్తుంది అన్నట్టు వైసీపీ కూడా ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల బరిలో నిలిచిందని వైస్ షర్మిళ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వైసీపీ ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. ప్రజలకు మంచి చేయాలంటే జగన్ అధికారంలోకి రావాలని అన్నారు. చెప్పింది చేసేవాడు కావాలంటే, రాజన్న రాజ్యం కావాలంటే, వెన్నుపోటు చంద్రబాబు పోవాలంటే తమ పార్టీకి ఒక్కసారి అవకాశమిచ్చి గెలిపించాలని చెప్పారు. జగన్‌ని ముఖ్యమంత్రిని చేయాలని, ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు బై బై చెబుదామని షర్మిళ అన్నారు.

మంచి పనులు చేశారు కనుకే, ఇంకా ప్రజల హృదయాల్లో వైఎస్ నిలిచిపోయారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని, పర,తమ అనే భేదం లేకుండా, మన పార్టీ వాడా? పక్క పార్టీ వాడా? మన కులమా? వేరే కులమా? అన్న విషయాలేవీ చూడకుండా ప్రతి ఒక్కరికీ అండగా నిలిచారని వైసీపీ నేత షర్మిళ అన్నారు.