Vijayasai reddy vs Ashok Gajapathi raju : ‘ఈ 40 ఏళ్లలో మీ హిందూత్వ ఎటు పోయింది అశోక్?’ : విజయసాయిరెడ్డి

|

Jun 18, 2021 | 4:33 PM

హిందూ మతంపై వైసీపీ ప్రభుత్వం ఎందుకు దాడులు చేస్తోందని అశోక్ గజపతి రాజు ప్రశ్నించారు. దుండగుల దాడిలో రాముని శిరస్సు ఖండించిన వారిని పట్టుకోకపోగా.. ఆలయ బాగు కోసం విరాళం ఇచ్చినా తిరస్కరించటం తీవ్ర మానసిక క్షోభకు గురి చేసిందన్నారు.

Vijayasai reddy vs Ashok Gajapathi raju : ఈ 40 ఏళ్లలో మీ హిందూత్వ ఎటు పోయింది అశోక్? : విజయసాయిరెడ్డి
Vijayasai Reddy
Follow us on

Mansas trust chairman Ashok Gajapathi raju : టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు వ్యాఖ్య‌ల‌ను వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్యసభ ఎంపీ విజ‌య సాయిరెడ్డి తిప్పికొట్టారు. ఈ 40 ఏళ్లలో మీ హిందూత్వ ఎటు పోయింది అశోక్? మీరు ఛైర్మన్ గా ఉన్న గుళ్లోనే విగ్రహాలు ధ్వంసం జరిగినప్పుడు ఏమైపోయారు? అంటూ విజయసాయి ట్విట్టర్ వేదికగా నిలదీసే ప్రయత్నం చేశారు. మాన్సాస్ లో ఆడిటింగ్ చేయనప్పుడు మీ పారదర్శకత ఏమైపోయింది? మీరు మంత్రిగా వెలగబెట్టినప్పుడే మోతీ మహల్ కూల్చారు. అప్పుడెక్కడికి పోయింది మీ చారిత్రక వారసత్వం? అంటూ విజ‌య సాయిరెడ్డి విరుచుకుపడ్డారు.

అంతకుముందు ‘రాజ‌కీయాల్లో అలాంటివి ఏముండ‌వు మాలోకం..’ అంటూ లోకేష్ పై పరోక్ష విమర్శలు చేశారు విజయసాయి. “అధికారంలోకి రాగానే అందరి ఖాతాలు సెటిల్ చేస్తావా? క్యాసినోలో పోగొట్టుకున్న డబ్బులు తిరిగి సంపాదించడం అనుకున్నావా. కోడి పందేల్లో ఓడి కొత్త పుంజుతో పోటీకి దిగినట్టా? రాజకీయాల్లో సెటిల్మింట్లు, రాసి పెట్టుకోడాలు, తేల్చుకోవడాలు ఏముండవు మాలోకం. గెలుపు, ఓటమి..ఈ రెండే ఉంటాయి” అంటూ మరో ట్వీట్‌లో విజ‌య సాయిరెడ్డి సెటైర్లు వేశారు.

ఇదిలా ఉండగా, హైకోర్టు తీర్పుతో సింహాచలం, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా మళ్లీ బాధ్యతలు చేపట్టిన పూసపాటి అశోక్ గజపతి రాజు కు ప్రభుత్వం నుంచి వరుస పరాభవాలు ఎదురవుతున్నాయి. సింహాచలంలోనూ.. మాన్సాస్ సంస్థలోనూ అధికారుల నుంచి అశోక్ కు సహకారం లభించడంలేదని తెలుస్తోంది. మాన్సాస్ ట్రస్టు బోర్డు చైర్మన్ గా అశోక్ గజపతి రాజు పునః బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మాన్సాస్ ఈవో డి. వెంకటేశ్వర రావు, కరెస్పాండెంట్ కేవీఎల్ రాజులు హాజరుకాలేదు. దీంతో వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డిపై అశోక్ గజపతిరాజు విరుచుకుపడ్డారు.

కాగా, హైకోర్టు తీర్పు తరువాత మాన్సాస్ ఛైర్మెన్‌గా అశోక్ గజపతిరాజు తొలి సంతకం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాన్సాస్‌లో ఆడిట్ జరగలేదంటే ఆశ్చర్యపోయానన్నారు. ఆడిట్ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదేనన్నారు. ప్రతి ఏడాది ఆడిట్ జరపటానికి సంస్ధ నుంచి ఫీజు కూడా అధికారికంగా చెల్లించామని చెప్పారు. దోపిడిదారులకు మాన్సాస్‌లో స్థానం లేదని అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు. రామతీర్థం విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమానికి కూడా తనను ఆహ్వానించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

హిందూ మతంపై వైసీపీ ప్రభుత్వం ఎందుకు దాడులు చేస్తోందని అశోక్ గజపతి రాజు ఈ సందర్భంలో ప్రశ్నించారు. దుండగుల దాడిలో రాముని శిరస్సు ఖండించిన వారిని పట్టుకోకపోగా.. ఆలయ బాగు కోసం విరాళం ఇచ్చినా తిరస్కరించటం తీవ్ర మానసిక క్షోభకు గురి చేసిందన్నారు. దేశంలో ఇంకా హిందూ మతం బతికుండటంతో ఆ విరాళం అయోధ్యలో సమర్పించామన్నారు. మహారాజకోటలో చారిత్రక మూలాలు ధ్వంసం చేశారన్నారు. సింహాచలం దేవస్థానం వద్ద ఆలయ ఈవో కూడా తనను కలవడానికి ఇష్ట పడలేదన్నారు. మాన్సస్ భూముల్లో ఇసుక అక్రమాలు ఎవరి హయాంలో జరిగాయో తేల్చాలని అశోక్ గజపతి రాజు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు ఇవాళ విజయసాయి ట్విట్టర్ వేదికగా ఇవాళ కౌంటర్ ఇచ్చారు.

Read also : Job calendar : లంచాలకు, పైరవీలకు తావులేకుండా ఈ ఏడాది 10,143 ఉద్యోగాల భర్తీ..! జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన సీఎం