YSRCP Vijayasai reddy: చంద్రన్న, అయ్యన్న కొడుకులు విశాఖను చెరబట్టారు : విజయసాయిరెడ్డి

చంద్రన్న, అయ్యన్న కొడుకులు విశాఖను చెరబట్టారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి...

YSRCP Vijayasai reddy: చంద్రన్న, అయ్యన్న కొడుకులు విశాఖను చెరబట్టారు : విజయసాయిరెడ్డి
Vijayasai Reddy

Updated on: Jul 12, 2021 | 2:26 PM

Vijayasai reddy – Chandrababu – Ayyannapatrudu: చంద్రన్న, అయ్యన్న కొడుకులు విశాఖను చెరబట్టారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. మైనింగ్‌లో అడ్డగోలుగా దోచుకుంది టీడీపీ నేతలు చంద్రబాబు, అయ్యన్న పాత్రుడేన‌ని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. దొంగే..దొంగా దొంగా అని అరిచినట్లుంది అయ్యన్న యవ్వారం! చంద్రబాబు సీఎంగా ఉండగా నాతవరంలోని లేటరైట్ గనులను నాకేసిన ఘనుడు అని విజయసాయి ఆరోపించారు.

గిరిజనుల పేరుతో లీజు పొంది ఏజెన్సీని కొల్లగొట్టిన గ’లీజ్ ‘గాళ్లు. అక్రమ మైనింగ్ కు అడ్డుకట్ట పడటంతో ధర్నా డ్రామాలు అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.

మీడియా నడిపించే దరిద్రపు పార్టీ ఏదన్నా ఉందంటే అది టీడీపీనే అని మరో ట్వీట్ లో విజయసాయి విమర్శలు ఎక్కుపెట్టారు. అనుకుల మీడియా సపోర్టుతో నిత్యం వార్తల్లో ఉంటారేమో గానీ, ప్రజల మనసుల్లో స్థానం ఎలా దొరుకుతుంది? అంటూ విజ‌య సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

Read also: Fuel price hike: దేశవ్యాప్తంగా పెరుగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలపై కన్నెర.. హైదరాబాద్‌లో భారీ ర్యాలీ తీసిన కాంగ్రెస్