సీఈసీని కలిసిన విజయసాయి రెడ్డి

|

Mar 22, 2019 | 8:14 PM

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తోన్న అక్రమాల గురించి సాక్ష్యాధారాల‌తో కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశామ‌ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. సీఈసీ సునీల్‌ అరోరాకి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నిక‌ల‌లో అక్రమాలకు పాల్పడేందుకు చంద్రబాబు నాయుడు త‌గిన ఏర్పాట్లు చేసుకున్నార‌ని ఆరోపించారు. ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని చంద్రబాబు కుట్ర ప‌న్నుతున్నారని విమర్శించారు. నూత‌న డీజీపీ నియామ‌కం, ప్రస్తుత డీజీపీ తొల‌గింపు […]

సీఈసీని కలిసిన విజయసాయి రెడ్డి
Follow us on

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తోన్న అక్రమాల గురించి సాక్ష్యాధారాల‌తో కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశామ‌ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. సీఈసీ సునీల్‌ అరోరాకి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నిక‌ల‌లో అక్రమాలకు పాల్పడేందుకు చంద్రబాబు నాయుడు త‌గిన ఏర్పాట్లు చేసుకున్నార‌ని ఆరోపించారు. ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని చంద్రబాబు కుట్ర ప‌న్నుతున్నారని విమర్శించారు. నూత‌న డీజీపీ నియామ‌కం, ప్రస్తుత డీజీపీ తొల‌గింపు అంశాల‌తోపాటు ఇంటిలిజెన్స్ విభాగం అధికారి వెంక‌టేశ్వర‌రావు, పోలీసు అధికారులు చ‌ట్ట వ్యతిరేక కార్యక్రమాల‌కు పాల్పడుతున్నట్లు ఈసీ దృష్టికి తీసుకెళ్లామ‌ని విజయసాయిరెడ్డి తెలిపారు.

పోలీసు విభాగంలో 37 మంది అధికారుల‌కు అక్రమ పద్దతుల్లో ప‌దోన్నతి క‌ల్పించార‌ని ఆయన ఆరోపించారు. నేత‌లు ఫోన్ల‌ను అక్రమంగా టాపింగ్ చేస్తున్నార‌ని, దీనికి సంబంధించిన ఆధారాలను ఈసీకి అప్పగించామ‌ని ఆయన తెలిపారు. ప్రజాశాంతి పార్టీ గుర్తు ,కండువా వైఎస్సార్‌సీపీ గుర్తులతో పోలి ఉన్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలనని కోరినట్టు తెలిపారు.