వివేకానంద రెడ్డి మృతి సహజ మరణం కాదు: అవినాష్ రెడ్డి

కడప: వైఎస్ వివేకానంద రెడ్డి మృతి సహజ మరణం కాదని వైసీపీ మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. తనకు అనేక అనుమానాలున్నాయని, కుట్ర కోణాలు వెలికి తీయాలన్నారు. నిందితులు ఎంతటివారైనా చర్యలు తీసుకోవాలి ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున వివేకానంద రెడ్డి గుండె పోటుతో కన్నుమూసినట్టు వార్తలొచ్చాయి. అయితే నుదిటి మీద, ముక్కుపై తీవ్ర గాయాలు ఉండటం, రక్తం ఎక్కువగా కనిపించడంతో ఆయన మృతిపై అనుమానాలు మొదలయ్యాయి. వివేకా మృతి వార్త తెలుసుకున్న […]

వివేకానంద రెడ్డి మృతి సహజ మరణం కాదు: అవినాష్ రెడ్డి

Updated on: Mar 15, 2019 | 3:36 PM

కడప: వైఎస్ వివేకానంద రెడ్డి మృతి సహజ మరణం కాదని వైసీపీ మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. తనకు అనేక అనుమానాలున్నాయని, కుట్ర కోణాలు వెలికి తీయాలన్నారు. నిందితులు ఎంతటివారైనా చర్యలు తీసుకోవాలి ఆయన డిమాండ్ చేశారు.

శుక్రవారం తెల్లవారుజామున వివేకానంద రెడ్డి గుండె పోటుతో కన్నుమూసినట్టు వార్తలొచ్చాయి. అయితే నుదిటి మీద, ముక్కుపై తీవ్ర గాయాలు ఉండటం, రక్తం ఎక్కువగా కనిపించడంతో ఆయన మృతిపై అనుమానాలు మొదలయ్యాయి. వివేకా మృతి వార్త తెలుసుకున్న వైఎస్ జగన్ హుటాహుటిన హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలుదేరారు.