కేసీఆర్ బాటలో జగన్

| Edited By: Srinu

Mar 06, 2019 | 8:54 PM

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటోన్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందుకు తగ్గట్లుగా పక్కా ప్రణాళికలను వేసుకున్నారు. అంతేకాదు విజయం కోసం రాజకీయ నిపుణుల సలహాలను తీసుకుంటోన్న జగన్, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలో నడవనున్నారు. తాజా సమాచారం ప్రకారం కేసీఆర్ మాదిరిగానే అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను ఒకేసారి ప్రకటించాలని జగన్ అనుకుంటున్నారట. ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ రాగానే మొత్తం 175 నియోజక వర్గాలకు అభ్యర్థులందరి పేర్లను […]

కేసీఆర్ బాటలో జగన్
Follow us on

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటోన్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందుకు తగ్గట్లుగా పక్కా ప్రణాళికలను వేసుకున్నారు. అంతేకాదు విజయం కోసం రాజకీయ నిపుణుల సలహాలను తీసుకుంటోన్న జగన్, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలో నడవనున్నారు. తాజా సమాచారం ప్రకారం కేసీఆర్ మాదిరిగానే అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను ఒకేసారి ప్రకటించాలని జగన్ అనుకుంటున్నారట.

ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ రాగానే మొత్తం 175 నియోజక వర్గాలకు అభ్యర్థులందరి పేర్లను జగన్ ప్రకటించనున్నారట. ఎన్నికల నోటిఫికేషన్ రావడమే ఆలస్యం రెండు, మూడు రోజుల్లోనే అభ్యర్థుల పేర్లను జగన్ ఖరారు చేయనున్నారట. దీనికి సంబంధించి ఇప్పటికే ఫైనల్ లిస్ట్‌ను జగన్ సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. ఇక అభ్యర్థుల పేర్లు ప్రకటించాక బస్సు యాత్రను కూడా జగన్ చేయనున్నారు.