ఆయన హాయంలోనే విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ.. అప్పుడు ఏమీ పట్టనట్టుగా ఉండి.. ఇప్పుడు రంకెలేస్తున్నాడెందుకో..

|

Feb 11, 2021 | 5:48 PM

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై పార్టీలకు అతీతంగా ఆందోళనలు..

ఆయన హాయంలోనే విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ.. అప్పుడు ఏమీ పట్టనట్టుగా ఉండి.. ఇప్పుడు రంకెలేస్తున్నాడెందుకో..
Vijayasai Reddy
Follow us on

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై పార్టీలకు అతీతంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైజాగ్‌ స్టీల్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ చంద్రబాబు హయాం లోనే ప్రారంభమైందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రైవేటీకరణకు అడుగులు పడ్డాయని అప్పుడు తనకేమి పట్టనట్లు ఉన్న చంద్రబాబు ఇప్పుడెందుకు రంకెలేస్తున్నాడని ట్విటర్‌ వేదికగా విజయసాయిరెడ్డి విమర్శించారు. పొస్కొకంపెనీ ప్రతినిధులు, కొరియా రాయబారి 2018 అక్టోబర్‌ 22న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను సందర్శించారని చెప్పారు. ఈ విషయాన్ని సాక్షాత్తు కేంద్రమంత్రి పార్లమెంట్‌లో ప్రస్తావించిన సంగతిని గుర్తు చేశారు.

చంద్రబాబు జిమ్మిక్కులను ఏపీ ప్రజలు నమ్మేస్థితిలో లేరని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఇప్పటికైన చంద్రబాబు రెండు నాలుకల ధోరణిని మానుకోవాలని విజయసాయిరెడ్డి హితవు పలికారు. విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీని రక్షించుకునేందకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తుందన్నారు.

Read more:

వైయస్‌ షర్మిలతో ఆళ్ల రామకృష్ణారెడ్డి భేటీ.. అనుకోకుండా వచ్చారా..? రాయబారిగానే వచ్చారా..?