సుమలతకు ‘కేజీఎఫ్’ స్టార్ మద్దతు

నటి సుమలత ప్రత్యక్షరాజకీయాల్లోకి వస్తున్నారు. మాండ్యా నుంచి ఎంపీ పదవికి ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో సుమలతకు కేజీఎఫ్ స్టార్ యశ్, మరో కన్నడ హీరో దర్శన్ అండగా నిలుస్తున్నారు. సుమలత తరపున మాండ్యాలో ప్రచారం చేస్తామని ఈ ఇద్దరు ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో చెప్పారు. అయితే యశ్‌ తనకు కుమారుడితో సమానమని అంబరీష్ పలు సందర్భాలలో చెప్పారు. ఆ రుణం తీర్చుకోవాలనే ఆలోచనతోనే యశ్ సుమలతకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారని కన్నడ […]

సుమలతకు ‘కేజీఎఫ్’ స్టార్ మద్దతు

Edited By:

Updated on: Mar 19, 2019 | 12:21 PM

నటి సుమలత ప్రత్యక్షరాజకీయాల్లోకి వస్తున్నారు. మాండ్యా నుంచి ఎంపీ పదవికి ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో సుమలతకు కేజీఎఫ్ స్టార్ యశ్, మరో కన్నడ హీరో దర్శన్ అండగా నిలుస్తున్నారు. సుమలత తరపున మాండ్యాలో ప్రచారం చేస్తామని ఈ ఇద్దరు ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో చెప్పారు.

అయితే యశ్‌ తనకు కుమారుడితో సమానమని అంబరీష్ పలు సందర్భాలలో చెప్పారు. ఆ రుణం తీర్చుకోవాలనే ఆలోచనతోనే యశ్ సుమలతకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారని కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇదే స్థానంకు జేడీఎస్ తరఫున కర్ణాటక ముఖ్యమంత్రి తనయుడు, నటుడు నిఖిల్ గౌడ పోటీ చేస్తున్నారు. ఇద్దరు సినీ పరిశ్రమకు చెందిన వారు పోటీ చేస్తుండటంతో కర్ణాటక రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.