బీజేపీ నూతన సారథిగా నడ్డా ?

|

May 31, 2019 | 5:48 PM

ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడైన అమిత్ షా మోదీ ప్రభుత్వంలో కీలక శాఖలో చేరిపోవడంతో ఇక బీజేపీలో అధ్యక్షునిగా ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న అంశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కొత్త అధ్యక్షుని కోసం కసరత్తు మొదలైంది. మోదీ గత ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన జగత్ ప్రకాష్ (జేపీ) నడ్డాను ఈ పోస్టుకు ఎంపిక చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. 2014 నుంచి..ఈ ఏడాది లో ఇటీవల జరిగిన లోక్ సభ […]

బీజేపీ నూతన సారథిగా నడ్డా ?
Follow us on

ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడైన అమిత్ షా మోదీ ప్రభుత్వంలో కీలక శాఖలో చేరిపోవడంతో ఇక బీజేపీలో అధ్యక్షునిగా ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న అంశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కొత్త అధ్యక్షుని కోసం కసరత్తు మొదలైంది. మోదీ గత ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన జగత్ ప్రకాష్ (జేపీ) నడ్డాను ఈ పోస్టుకు ఎంపిక చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. 2014 నుంచి..ఈ ఏడాది లో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల వరకు నడ్డా పార్టీ ప్రధాన కార్యాలయం నుంచే ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షిస్తూ వచ్చారు. ముఖ్యంగా యూపీలో పార్టీ ఇన్-చార్జిగా ఆయన వ్యవహరించారు. అమిత్ షా మాదిరే ఈయన కూడా మంచి వ్యూహకర్త. యూపీలో లోక్ సభ ఎన్నికల్లో పార్టీ 50 శాతం ఓట్లు సాధించేలా చూడాలని అమిత్ షా నిర్దేశించగా.. నడ్డా… 49.6 శాతం ఓట్లను సాధించేలా చూసి పార్టీ ఘన విజయానికి దోహదపడ్డారు. దీంతో బీఎస్పీ, ఎస్పీ లను చిత్తు చేసి.. బీజేపీ 62 స్థానాలను కొల్ల గొట్టగలిగింది. నడ్డా సమర్థతపై కొండంత నమ్మకం పెట్టుకున్న మోదీ , అమిత్ షా కూడా ఆయననే పార్టీ అధ్యక్షునిగా ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. జన్మతః బీహారీ అయినా… నడ్డా పొలిటికల్ కెరీర్ హిమాచల్ ప్రదేశ్ లో ప్రారంభమైంది. మోదీ పాత కేబినెట్లో మంత్రిగా పని చేసిన ఆయన స్వతహాగా బిడియస్తుడని తెలిసింది. అందువల్లే ఆయన పేరు ఇప్పటివరకూ పెద్దగా ప్రచారంలోకి రాలేదు .కొన్ని రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి నడ్డా మరింత కృషి చేయగలరని అధినాయకత్వం భావిస్తోంది. పైగా ఒక వ్యక్తికి ఒకే సారి పదవి అన్న నియమావళిని పార్టీ పాటించినట్టూ అవుతుంది. ఈ నేపథ్యంలో… అధ్యక్ష పదవికి రేసులో నడ్డా పేరే వినిపిస్తోంది.