ఏపీలో తప్పుల తడకగా ఓటర్ల జాబితా!

| Edited By:

Apr 03, 2019 | 2:07 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఎన్నికల్లో విచిత్రం జరిగింది. ఒకరికి ఒక ఓటే ఉండాలన్నది రూలు.. కానీ ఘనత వహించిన మన ఎన్నికల అధికారులు.. కొందరు ఓటర్ల పేరు మీద ఒకటికి మించి ఓట్లు ఇచ్చేశారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద కుమార్తె హర్షిణిరెడ్డి పేరుతో రెండు ఓట్లు.. ఆయన సోదరి షర్మిల పేరుతో రెండు ఓట్లు ఉండగా.. సాక్షాత్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ పేరుతో మూడు ఓట్లు ఉన్నాయి. విశాఖలో ఒక […]

ఏపీలో తప్పుల తడకగా ఓటర్ల జాబితా!
Follow us on

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఎన్నికల్లో విచిత్రం జరిగింది. ఒకరికి ఒక ఓటే ఉండాలన్నది రూలు.. కానీ ఘనత వహించిన మన ఎన్నికల అధికారులు.. కొందరు ఓటర్ల పేరు మీద ఒకటికి మించి ఓట్లు ఇచ్చేశారు.

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద కుమార్తె హర్షిణిరెడ్డి పేరుతో రెండు ఓట్లు.. ఆయన సోదరి షర్మిల పేరుతో రెండు ఓట్లు ఉండగా.. సాక్షాత్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ పేరుతో మూడు ఓట్లు ఉన్నాయి.

విశాఖలో ఒక ఓటరు పేరుతో అయితే ఏకంగా తొమ్మిది ఓట్లున్నాయి! ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఒకటికి మించిన ఓట్లున్న ఓటర్లు చాలా మందే కనపడుతున్నారు. జగన్‌ ఇలాకా పులివెందులలో ఒకటికి మించిన ఓట్లున్న ఓటర్లు చాలా మందే కనపడుతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. జగన్‌ కుటుంబసభ్యుల్లోనే ఇద్దరికి రెండేసి చొప్పున ఓట్లు ఉండడాన్ని వారు గుర్తుచేస్తున్నారు.