కడప: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పోలీసుల చేతిలో ఉన్న లెటర్ వివాదాస్పదంగా మారింది. తొలుత దీని గురించి ఏపీ ప్రతిపక్షనేత జగన్ ప్రస్తావించారు. పోలీసులతో తాను మాట్లాడేందుకు వెళ్లినప్పుడు తనకు ఒక లెటర్ చూపించారని, అది దాడి తర్వాత వివేకానంద రెడ్డి గారు రాసినట్టు చెప్పారని అన్నారు.
తర్వాత చంద్రబాబు కూడా ఇదే లెటర్ గురించి మాట్లాడుతూ ఉదయం లేని లెటర్ సాయింత్రానికి ఎలా వచ్చింది? ఎందుకొచ్చింది? అని ప్రశ్నించారు. పలు చర్చల్లో, వార్తల్లో ఈ లెటర్ గురించి అంతా ప్రస్తావిస్తున్నారు.
“నా డ్రైవర్ నేను తొందరగా డ్యూటీకి రమ్మన్నాను అని చచ్చేలా కొట్టి నాడు. ఈ లెటర్ రాసే దానికి చాలా కష్టపడ్డాను. డ్రైవర్ ప్రసాదును వదిలిపెట్టొద్దు…. ఇట్లు వై.యస్ వివేకానంద రెడ్డి” అని లెటర్‌లో ఉంది.