Ugadi: ప్లవనామ ఉగాది వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా కొనసాగుతున్నాయి. తెలుగువారి కొత్త సంవత్సరాదిని ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఈ పండుగ ప్రత్యేకత అయిన పంచాంగ శ్రావణ కార్యక్రమం అన్ని చోట్లా నిర్వహించారు. విశాఖపట్నంలోని శ్రీ శారదాపీఠంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి వెల్లడించారు.
ఈ ఏడాది ఒక పెద్ద నేతకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని స్వరూపానందేంద్ర స్వామి చెప్పారు. అదే విధంగా గ్రహాల అనుకూలత అంత బాగాలేకున్నా తెలుగు రాష్ట్రాలకు మంచి జరుగుతుందని భావిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖాయమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణా ముఖాయమంత్రి కేసీఆర్ జాతకాలు బావున్నాయని స్వరూపానందేంద్ర స్వామి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవని స్వరూపానందేంద్ర స్వామి స్పష్టం చేశారు.
కాగా.. జగన్, కేసీఆర్ జాతకాలు బావుంటే.. మరి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోబోతున్న నేత ఎవరనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆ పెద్ద నేత రాష్ట్రానికి చెందిన నేతా.. దేశానికి చెందిన నేతా అనేది స్వామి స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ కచ్చితంగా స్వామీజీ ఇక్కడి నాయకుడి గురించే మాట్లాడి ఉంటారని ఏపీలో రాజకీయవర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇంతకీ ఆ పెద్దాయనకు ఏ రకమైన కష్టాలు వస్తాయో పాపం అని ఎవరికి వారు లెక్కలు కడుతున్నారు. ఇప్పటికే ఆ పెద్ద నేతకు కష్టాలు మొదలయ్యాయి. ఇంకా మరిన్ని కష్టాలు రాబోతున్నాయన్న మాట అంటూ కొంతమంది వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అయినా, రాజకీయాలన్నాకా కష్టాలు వస్తూనే ఉంటాయి. అధికారంలో లేకపోతే ఇంకా ఎక్కువగా వస్తాయి. ఆ మాత్రం దానికి భయపడితే పెద్ద నేత ఎలా అవుతారు లెండి అని కొంత మంది అంటున్నారు. మొత్తమ్మీద ప్లవ నామ ఉగాది వేడుకల్లో స్వరూపానందేంద్ర స్వామి చెప్పిన కష్ట జాతకం ఎవరనేది ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: BB3 Movie : అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన బాలయ్య.. ‘అఖండ’గా రానున్న నటసింహం.. టీజర్ విడుదల
Ugadi 2021: మీ మిత్రులకు, సన్నిహితులకు శ్రీ ప్లవ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలపండిలా..