ఏపీలో లేఖల రాజకీయం

|

Sep 22, 2019 | 10:32 PM

నిన్నటివరకు ట్విట్టర్‌లో విమర్శలు చేసుకున్న ఆంధ్రప్రదేశ్‌లోని అధికార, ప్రతిపక్షాలు ఇప్పుడు లేఖల వైపు మళ్లాయి. ప్రస్తుతం ఏపీలో లేఖల రాజకీయం నడుస్తుంది. సీఎం జగన్‌కు చంద్రబాబు రాసిన లేఖ సారాంశం: నాలుగు నెలల వైఎస్సార్‌సీపీ పాలనలో రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజలకు ఎదురైన ఇబ్బందులకు.. అనుభవ రాహిత్యం, చేతకానితనం, ఆశ్రిత పక్షపాతంతో.. మూర్ఖత్వం-కక్ష సాధింపు వైఖరే మూల కారణమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్వహణ ఎంతో క్లిష్టమైనది, ఎన్నో సవాళ్లతో కూడిన అంశం.. నిత్యం అనేక శాఖలపై […]

ఏపీలో లేఖల రాజకీయం
Follow us on

నిన్నటివరకు ట్విట్టర్‌లో విమర్శలు చేసుకున్న ఆంధ్రప్రదేశ్‌లోని అధికార, ప్రతిపక్షాలు ఇప్పుడు లేఖల వైపు మళ్లాయి. ప్రస్తుతం ఏపీలో లేఖల రాజకీయం నడుస్తుంది.

సీఎం జగన్‌కు చంద్రబాబు రాసిన లేఖ సారాంశం:

నాలుగు నెలల వైఎస్సార్‌సీపీ పాలనలో రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజలకు ఎదురైన ఇబ్బందులకు.. అనుభవ రాహిత్యం, చేతకానితనం, ఆశ్రిత పక్షపాతంతో.. మూర్ఖత్వం-కక్ష సాధింపు వైఖరే మూల కారణమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్వహణ ఎంతో క్లిష్టమైనది, ఎన్నో సవాళ్లతో కూడిన అంశం.. నిత్యం అనేక శాఖలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి, అనుక్షణం అప్రమత్తత అవసరం అన్నారు. పరిపాలనకు అనుభవం ఎంత అక్కరకు వస్తుందో, కార్యదక్షత అంతకుమించి దోహదకారి అవుతుందన్నారు. క్వశ్చన్ పేపర్ లీకేజి- ఫ్యామిలీ ప్యాకేజీ.. అయిన వాళ్లకు అందలాలు-కానివాళ్లకు మార్కుల కోతలు.. ప్రశ్నాపత్రం టైప్ చేసిన వ్యక్తే పరీక్షలో టాపర్.. అంటూ పేపర్ లీకేజ్ వివాదంపై జగన్ సర్కార్‌ను టార్గెట్ చేశారు. పేపర్ లీకేజి అదేదో ఫ్యామిలీ ప్యాకేజిగా మారిందని.. అయిన వాళ్లకు అందలాలు-కానివాళ్లకు మార్కుల కోతలు అన్నారు. ప్రశ్నాపత్రం టైప్ చేసిన వ్యక్తే పరీక్షలో టాపర్‌గా వచ్చిందని.. ఏపీపీఎస్సీలో ఏఎస్‌వో తమ్ముడికి ఒక కేటగిరిలో టాప్ ర్యాంకు.. ఇంకో కేటగిరిలో 3వ ర్యాంకు వచ్చిందన్నారు. వాళ్ల బంధువులు, స్నేహితులకే మంచి మార్కులు సాధించారనే వార్తలే క్వశ్చన్ పేపర్ లీకేజి అయ్యిందనడానికి తిరుగులేని రుజువులు అన్నారు బాబు. గతంలో లీకేజ్ వ్యవహారంలో ముఖ్యమంత్రులు రాజీనామా చేసిన పరిస్థితి చూశాం అంటూ జగన్ అసెంబ్లీలో గతంలో చేసిన వ్యాఖ్యల్ని చంద్రబాబు గుర్తు చేశారు. జరిగిన దానికి బాధ్యత వహించి గతంలో చేసిన వ్యాఖ్యల ప్రకారం.. జగన్ రాజీనామా చేస్తారో.. పంచాయితీరాజ్, విద్యాశాఖ మంత్రులే రాజీనామా చేయాలో వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు చంద్రబాబు.

 

ఇక టీడీపీకి కౌంటరిచ్చింది ఏపీ ప్రభుత్వం. ఆ పార్టీ  అధినేత చంద్రబాబుకు ఉపముఖ్యమంత్రులు లేఖ రాశారు. జగన్​కు చంద్రబాబు లేఖ రాయడంపై నేతలు తీవ్రంగా స్పందించారు.

ఉపముఖ్యమంత్రుల లేఖలోని సారాంశం:

లక్షల ఉద్యోగాలు ఇవ్వడం చూసి చంద్రబాబుకు అసూయగా ఉందని మండిపడ్డారు. ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామనే అక్కసుతోనే ముఖ్యమంత్రి జగన్​కు చంద్రబాబు లేఖ రాశారని ఆరోపించారు. చంద్రబాబు ఐదేళ్లలో ఎందుకు ఉద్యోగాలు భర్తీ చేయలేదు? అని లేఖలో ప్రశ్నించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలను చూసి ఓర్వలేకపోతున్నారని ఉప ముఖ్యమంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలన ఎలా సాగిందో ప్రజలందరికీ అర్థమైందని లేఖలో పేర్కొన్నారు.