
Vijayashanthi BJP join: విజయశాంతి మళ్లీ సొంత గూటికి వెళ్లనున్నారా..? అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. బీజేపీలో చేరేందుకు రాములమ్మకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. సోమవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, విజయశాంతిని హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు ఈ ఇద్దరు మాట్లాడుకోగా.. కాషాయ కండువాను కప్పుకునేందుకు ఆమెకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం.
అయితే 1998లో బీజేపీలో చేరడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని విజయశాంతి ప్రారంభించారు. అంతేకాదు బీజేపీ విమెన్స్ వింగ్ (భారతీయ మహిళా మోర్చా) సెక్రటరీగా కూడా పనిచేశారు. అయితే ఆ తరువాత బీజేపీ నుంచి బయటకు వచ్చిన విజయశాంతి.. 2009లో తల్లి తెలంగాణ అని సొంత పార్టీని స్థాపించారు. తరువాత దాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ తరఫున 2009 ఎన్నికల్లో ఎంపీగా కూడా విజయం సాధించారు. ఆ తరువాత టీఆర్‌ఎస్‌లో విబేధాలు రావడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి.. 2014లో కాంగ్రెస్‌లో చేరారు. ఈ క్రమంలో 2014 ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. అయితే గత కొన్ని నెలలుగా విజయశాంతి కాంగ్రెస్‌కు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆమె బీజేపీలో చేరబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
Read More:
60 లక్షల గ్లోవ్స్‌ని ఎత్తుకెళ్లిన దొంగలు
కరోనా వైరస్ ఉంది మరి ! నో షేక్ హ్యాండ్స్, ఓన్లీ ‘ఎల్బో బంప్ ‘ !