ట్విట్టర్ వేదికగా పవన్‍పై విజయసాయి తీవ్ర విమర్శలు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీలు, నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎన్నికల ప్రచారంతో పాటూ సోషల్ మీడియాలో కూడా మాటల తూటాలు పేలుస్తున్నారు. వివాదాస్పద‌ వ్యాఖ్యలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ట్విట్టర్ ద్వారా ప్రత్యర్థులకు పంచ్‌లు విసురుతున్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు విజయసాయిరెడ్డి. ‘నువ్వొక అమ్ముడు పోయిన వ్యక్తివి. ఉల్లిపాయ మీద పొట్టు కూడా తీయలేవు పవన్ కళ్యాణ్. అమాయకుల అభిమానాన్ని తాకట్టు […]

ట్విట్టర్ వేదికగా పవన్‍పై విజయసాయి తీవ్ర విమర్శలు

Updated on: Apr 03, 2019 | 12:03 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీలు, నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎన్నికల ప్రచారంతో పాటూ సోషల్ మీడియాలో కూడా మాటల తూటాలు పేలుస్తున్నారు. వివాదాస్పద‌ వ్యాఖ్యలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ట్విట్టర్ ద్వారా ప్రత్యర్థులకు పంచ్‌లు విసురుతున్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు విజయసాయిరెడ్డి.

‘నువ్వొక అమ్ముడు పోయిన వ్యక్తివి. ఉల్లిపాయ మీద పొట్టు కూడా తీయలేవు పవన్ కళ్యాణ్. అమాయకుల అభిమానాన్ని తాకట్టు పెట్టి నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు వచ్చినోడివి. ఏప్రిల్‌ 11 వరకు గంతులేసి వెళ్లు. నీ బతుక్కు తాటలు తీయడమొకటా? నీ యజమాని చంద్రబాబే అన్ని సర్ధుకుంటున్నాడు’ అని మ‍ండిప‌డ్డారు విజయసాయిరెడ్డి.

‘ఎన్నికలు ఎలాగూ ఏక పక్షమని తేలిపోయింది. జగన్ గారు కాబోయే ముఖ్యమంత్రి అని ప్రజలు ఆశీర్వచనాలు పలుకుతున్నారు. ఈ ఉద్విగ్న భరిత సమయంలో కామెడీ పండించిన పాల్, పావలా, పప్పులకు ధన్యవాదాలు ముందే చెప్పాలి. కులగజ్జి మీడియాను మాత్రం ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదు’ అని మరో ట్వీట్‍లో విమర్శించారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us