జగన్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన వంగవీటి రాధాక‌ృష్ణ

టీడీపీ తీర్థం పుచ్చుకున్న వంగవీటి రాధాకృష్ణ.. వైఎస్ జగన్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. నిరంతరం వెన్నుపోట్ల గురించి మాట్లాడే జగన్ తనను తమ్ముడూ అంటూనే వెన్నుపోటు పొడిచాడని కామెంట్ చేశారు రాధాక‌ృష్ణ. ఏపీలో ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయడమే తన లక్ష్యమన్నారాయన. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయకత్వం అవసరమన్నారు రాధాకృష్ణ. వైసీపీ విలువలు లేని రాజకీయం చేస్తోందని మండిపడ్డారు రాధ. జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను తప్పా .. […]

జగన్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన వంగవీటి రాధాక‌ృష్ణ

Edited By:

Updated on: Mar 14, 2019 | 10:46 AM

టీడీపీ తీర్థం పుచ్చుకున్న వంగవీటి రాధాకృష్ణ.. వైఎస్ జగన్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. నిరంతరం వెన్నుపోట్ల గురించి మాట్లాడే జగన్ తనను తమ్ముడూ అంటూనే వెన్నుపోటు పొడిచాడని కామెంట్ చేశారు రాధాక‌ృష్ణ. ఏపీలో ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయడమే తన లక్ష్యమన్నారాయన. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయకత్వం అవసరమన్నారు రాధాకృష్ణ.

వైసీపీ విలువలు లేని రాజకీయం చేస్తోందని మండిపడ్డారు రాధ. జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను తప్పా .. రాజకీయాల్లో ఉన్నంత వరకూ చంద్రబాబు వెంటే ఉంటానని ప్రకటించారు. అసత్య ప్రచారాలను నమ్మవద్ంటూ పిలుపునిచ్చారు.