పార్టీ మారే యోచనలో వంశీకృష్ణ శ్రీనివాస్‌

విశాఖ తూర్పు నియోజకవర్గ వైసీపీ నేతలతో వంశీకృష్ణ శ్రీనివాస్‌ భేటీ అయ్యారు. సీటు విషయంలో అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆయన మనస్తాపం చెందినట్లు తెలిసింది. అధిష్టానం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో వంశీకృష్ణ శ్రీనివాస్‌ పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సమాచారం. విశాఖ తూర్పు నియోజకవర్గానికి వంశీకృష్ణ శ్రీనివాస్‌ను సమన్వయకర్తగా జగన్ నియమించారు. దీంతో గత కొంత కాలంగా ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ కోసం ఇంత కష్టపడిన తనకు […]

పార్టీ మారే యోచనలో వంశీకృష్ణ శ్రీనివాస్‌

Updated on: Mar 13, 2019 | 6:33 PM

విశాఖ తూర్పు నియోజకవర్గ వైసీపీ నేతలతో వంశీకృష్ణ శ్రీనివాస్‌ భేటీ అయ్యారు. సీటు విషయంలో అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆయన మనస్తాపం చెందినట్లు తెలిసింది. అధిష్టానం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో వంశీకృష్ణ శ్రీనివాస్‌ పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సమాచారం. విశాఖ తూర్పు నియోజకవర్గానికి వంశీకృష్ణ శ్రీనివాస్‌ను సమన్వయకర్తగా జగన్ నియమించారు. దీంతో గత కొంత కాలంగా ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ కోసం ఇంత కష్టపడిన తనకు టికెట్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడంతో వంశీకృష్ణ శ్రీనివాస్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us