ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్ రాజీనామా

| Edited By: Pardhasaradhi Peri

Jun 05, 2019 | 8:53 PM

టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ్ నల్గొండ లోక్‌సభన నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రెండు సభల్లో కొనసాగే అవకాశం లేనందువల్ల అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అసెంబ్లీ సెక్రటరీకి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అయితే ఇప్పుడీ స్థానానికి పోటీ చేసేందుకు కాంగ్రెస్ నుంచి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. […]

ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్ రాజీనామా
Follow us on

టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ్ నల్గొండ లోక్‌సభన నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రెండు సభల్లో కొనసాగే అవకాశం లేనందువల్ల అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అసెంబ్లీ సెక్రటరీకి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అయితే ఇప్పుడీ స్థానానికి పోటీ చేసేందుకు కాంగ్రెస్ నుంచి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. 2014లో కోదాడ నుంచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించిన ఉత్తమ్ సతీమణి పద్మావతి గత ఎన్నికల్లో ఓటిమి చెందారు. ఇప్పుడు హుజూర్‌నగర్ నుంచి పద్మావతి బరిలో దిగుతారని ప్రచారం సాగుతోంది. అయితే ఉత్తమ్‌కుమార్ మాత్రం తన సతీమణి ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదని చెప్పారు. తమ పార్టీ అధిష్టానమే అభ్యర్థిని నిర్ణయిస్తుందని తెలిపారు.