మహిళలు కత్తులు ధరించి తిరగాలిః యూపీ మంత్రి

|

Oct 21, 2020 | 4:00 PM

ఉత్తరప్రదేశ్‌రాష్ట్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు కత్తులు ధరించి తిరగాలంటూ సూచించారు.

మహిళలు కత్తులు ధరించి తిరగాలిః యూపీ మంత్రి
Follow us on

ఉత్తరప్రదేశ్‌రాష్ట్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు కత్తులు ధరించి తిరగాలంటూ సూచించారు. యూపీలో మహిళల రక్షణకు మిషన్ శక్తి కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో అమ్మాయిలు తమ రక్షణకు తమ దగ్గర కత్తులను ఉంచుకోవాలని, అవసరమైనపుడు వాటిని వాడాలని యూపీ రాష్ట్ర మంత్రి మనోహర్‌లాల్ పిలుపునిచ్చారు. జిల్లా అధికారుల సమక్షంలో మంత్రి మనోహర్‌లాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని మహిళల రక్షణకు అనేక చర్యలు చేపట్టారు. ఇటువంటి సమయంలో మంత్రి మనోహార్ లాల్ మహిళలంతా కత్తులు పట్టాలనే సలహా ఇవ్వడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇంతేకాకుండా మహిళలు అవసరమైన సందర్భాల్లో కత్తులతో దాడులకు దిగాలన్నారు రెచ్చగొట్టాడు. లలిత్‌పూర్ పోలీస్‌లైన్‌లో జిల్లా అధికారులు, పోలీసు అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఈ విధంగా వ్యాఖ్యానించారు. మహిళలు ఆందోళన చెందవద్దని, రాష్ట్రమంతా వారికి అండగా ఉంటుందని మంత్రి అన్నారు. కాగా మంత్రి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మహిళలను రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలను ఖండించిన ప్రతిపక్ష నేతలు ఆయనపై విరుచుకుపడుతున్నారు.