Kishan Reddy: కేసీఆర్ కుటుంబం అందుకు కంకణం కట్టుకుంది.. నెరవేరదంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు

|

Aug 20, 2021 | 5:29 PM

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. జన ఆశీర్వాదయాత్రల్లో భాగంగా కిషన్ రెడ్డి

Kishan Reddy: కేసీఆర్ కుటుంబం అందుకు కంకణం కట్టుకుంది.. నెరవేరదంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు
Kishan Reddy
Follow us on

Union Minister Kishan Reddy Yatra: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. జన ఆశీర్వాదయాత్రల్లో భాగంగా కిషన్ రెడ్డి కొంచెం సేపటి క్రితం హనుమకొండ చౌరస్తాలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి.. కేసీఆర్ సర్కారు మీద విమర్శలు గుప్పించారు. “ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు కేసీఆర్ కుటుంబం కంకణం కట్టుకుంది. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గెలుస్తారు. కేసీఆర్ కుటుంబం ఈటల రాజేందర్ పై కక్ష కట్టింది. ఈటలపై కేసీఆర్ కుటుంబం దాడి చేస్తోంది. కేసీఆర్ అహంకారానికి హుజూరాబాద్ ప్రజలు బుద్ది చెబుతారు” అని కిషన్ రెడ్డి అన్నారు.

జన ఆశీర్వాదయాత్రలో భాగంగా ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు చోట్ల ప్రసంగించిన కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తెలంగాణను ముఖ్యమంత్రి అప్పులు పాలు చేశారని.. ప్రజల డబ్బును తండ్రి కొడుకులు దోచుకుంటున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అనేక పథకాలను వివరించిన కిషన్ రెడ్డి.. ముఖ్యంగా రేషన్ బియ్యంతోపాటు మహిళల సంఘాలకు 20 లక్షల రూపాయల వరకు రుణాన్ని అందించేందుకు పీఎం నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

తెలంగాణ ప్రజలు పోరాడి సాధించిన తెలంగాణ… తండ్రి కొడుకుల పాలైందన్నారు కిషన్ రెడ్డి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను సీఎం కేసిఆర్ అప్పుల పాలు చేశారన్నారు. మరికొద్దిరోజులు కేసీఆర్ పాలన ఇలాగే సాగితే.. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేరన్నారు. కేంద్రం అనేక పథకాలతో రాష్ట్రానికి నిధులు ఇస్తోందని.. నరేంద్ర మోడీ డబ్బులు ఇస్తే.. ప్రచారం మాత్రం సీఎం కేసిఆర్ చేసుకుంటున్నారని దుయ్యబట్టారు.

కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కిషన్ రెడ్డి యాత్రను టీఆర్ఎస్, దళిత సంఘాలు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. తోర్రురులో ఎస్సీవర్గీకరణ బిల్లును పెట్టాలంటూ టీఆర్ఎస్ నేతలతో పాటు దళిత సంఘాల నేతలు కిషన్ రెడ్డిని అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Read also:  Sravana Sukravaram: తెలుగు లోగిళ్లలో శ్రావణ శుక్రవారం సందండి.. గుళ్లు, ఇళ్లల్లో వరలక్ష్మి వ్రతం పండగ శోభ