ఈవీఎంల నమూనాలో ‘బీజేపీ’ పేరుపై ఈసీకు తృణమూల్ ఫిర్యాదు

|

Apr 28, 2019 | 10:57 AM

దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావిడి నడుస్తున్న విషయం తెలిసిందే. మే 23 ఫలితాల ప్రకటన వరకు ఈ ఫీవర్ కొనసాగనుంది. అయితే బెంగాల్‌లో మాత్రం రాజకీయం వేడెక్కుతుంది. బెరక్పోర్ లోక్ సభ నియోజకవర్గంలో  ఈవీఎంకు సంబంధించిన ఈవీఎం నమూనా బ్యాలెట్ పేపర్లపై పార్టీ గుర్తుతో పాటు పార్టీ పేరు కూడా ముద్ర వేయడంతో, బెంగాల్ పాలక పార్టీ తృణమూల్ కాంగ్రెస్ శనివారం భారత ఎన్నికల కమిషన్‌ను సంప్రదించింది. ఈ మేరకు  తృణమూల్ నేత దినేష్ త్రివేది ఎన్నికల […]

ఈవీఎంల నమూనాలో బీజేపీ పేరుపై ఈసీకు తృణమూల్ ఫిర్యాదు
Follow us on

దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావిడి నడుస్తున్న విషయం తెలిసిందే. మే 23 ఫలితాల ప్రకటన వరకు ఈ ఫీవర్ కొనసాగనుంది. అయితే బెంగాల్‌లో మాత్రం రాజకీయం వేడెక్కుతుంది. బెరక్పోర్ లోక్ సభ నియోజకవర్గంలో  ఈవీఎంకు సంబంధించిన ఈవీఎం నమూనా బ్యాలెట్ పేపర్లపై పార్టీ గుర్తుతో పాటు పార్టీ పేరు కూడా ముద్ర వేయడంతో, బెంగాల్ పాలక పార్టీ తృణమూల్ కాంగ్రెస్ శనివారం భారత ఎన్నికల కమిషన్‌ను సంప్రదించింది. ఈ మేరకు  తృణమూల్ నేత దినేష్ త్రివేది ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీ సింబల్ ‘కమలం’ క్రింద బీజేపీ అని రాసి ఉందని..మరే పార్టీ గుర్తు కింద అలా పార్టీ పేరు లేదని..దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదు సారాంశం. ఈసీ నియమావళికి ఇది పూర్తి విరుద్దం అన్నది టీఎమ్‌సీ వాదన. వెంటనే బీజేపీ పేరును తొలిగించాలని..లేని పక్షంలో అన్ని పార్టీల పేర్లను కూడా ఉండేలా చెయ్యాలని టీఎమ్‌సీ కోరుతుంది. అయితే ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల కమీషన్ ఆధారాలను పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పింది.