తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి కనబడటం లేదని సెటైర్ వేశారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్పీకర్ కార్యాలయానికి ఫోన్ చేయగా ఆయన లేరని కార్యదర్శి చెప్పడంతో స్పందించిన ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను కలిసేందుకు సమయం కేటాయించిన స్పీకర్.. మాకు ఎందుకు టైం ఇవ్వరని ప్రశ్నించారు. అసలు ఫిరాయింపు ఎమ్మెల్యేలను రహస్యంగా ఎందుకు కలిశారని అన్నారు. హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉండగా.. విలీనంపై స్పీకర్ ఎలా నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.