ఎన్నికల నేపథ్యంలో టీజేఎస్ నుంచి కీలక ప్రకటన

|

Mar 13, 2019 | 4:32 PM

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో టీజేఎస్ పార్టీ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఎన్నికల నేపథ్యంలో ఆయన తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ నుంచి జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో పోటీ చేయనున్నట్టు తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం వెల్లడించారు. కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్‌గిరి స్థానాల నుంచి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు. అయితే మిగిలిన ఆ నాలుగో స్థానం సంగతి పార్టీ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు కోదండరాం చెప్పారు. […]

ఎన్నికల నేపథ్యంలో టీజేఎస్ నుంచి కీలక ప్రకటన
Follow us on

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో టీజేఎస్ పార్టీ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఎన్నికల నేపథ్యంలో ఆయన తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ నుంచి జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో పోటీ చేయనున్నట్టు తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం వెల్లడించారు.

కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్‌గిరి స్థానాల నుంచి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు. అయితే మిగిలిన ఆ నాలుగో స్థానం సంగతి పార్టీ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు కోదండరాం చెప్పారు. అయితే మిగిలిన స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు.