ఆ నియోజకవర్గంలో మాత్రం మూడు దశల్లో పోలింగ్.. కారణం ఏంటంటే..

| Edited By:

Mar 12, 2019 | 4:30 PM

శ్రీనగర్: దేశ వ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో దాదాపుగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తారు. కానీ జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని అనంత్‌నాగ్ లోక్‌సభ స్థానానికి మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి కారణం కూడా ఈసీ వివరించింది. నిఘా వర్గాల రిపోర్టు మేరకు ప్రభుత్వం అనంత్‌నాగ్‌లో మూడు దశల్లో పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ప్రాంతంలో ఉగ్రదాడులకు ఆస్కారం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఘాటీ స్థానానికి ఉగ్రవాదుల నుంచి ముప్పు అధికంగా పొంచివుంది. […]

ఆ నియోజకవర్గంలో మాత్రం మూడు దశల్లో పోలింగ్.. కారణం ఏంటంటే..
Follow us on

శ్రీనగర్: దేశ వ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో దాదాపుగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తారు. కానీ జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని అనంత్‌నాగ్ లోక్‌సభ స్థానానికి మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి కారణం కూడా ఈసీ వివరించింది. నిఘా వర్గాల రిపోర్టు మేరకు ప్రభుత్వం అనంత్‌నాగ్‌లో మూడు దశల్లో పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ప్రాంతంలో ఉగ్రదాడులకు ఆస్కారం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఘాటీ స్థానానికి ఉగ్రవాదుల నుంచి ముప్పు అధికంగా పొంచివుంది. పుల్వామా తరువాత ఈ ప్రాంతం హైఅలర్ట్ జోన్‌లో ఉంది. ఇటీవలి కాలంలో ఇక్కడ పలు ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. అనంత్‌నాగ్ లోక్‌సభ స్థానం పరిధిలో అనంత్‌నాగ్, కుల్గామ్, షోపియా, పుల్వామా, ట్రాల్ ప్రాంతాలున్నాయి. ఇవన్నీ ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలే. అనంతనాగ్‌లో మూడవ దశలో ఏప్రిల్ 23న, కుల్గామ్‌లో నాల్గవ దశలో ఏప్రిల్ 29న, పుల్వామా, షోపియా జిల్లాలలో ఐదవ దశలో మే 6న ఎన్నికల జరగనున్నాయి.