నంద్యాల సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(CM Jagan) చేసిన కామెంట్స్‌పై తెలుగు దేశం పార్టీ (TDP) నేతలు మండిపడుతున్నారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఉండి బజారు భాష మాట్లాడతారా? అంటూ ప్రశ్నించారు. బూతుల మంత్రి కొడాలి నాని భాషనే సిఎం మాట్లాడటం హేయం అని విమర్శించారు. సీఎం జగన్ భాష చూస్తే ఆయన మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లుగా ఉందన్నారు. సెల్ ఫోన్ వెలుగులో ప్రసవాలు చేస్తుంటే సిగ్గనిపించడంలేదా? అంటూ మండిపడ్డారు. పాలన చేతగాకే ఫ్రస్టేషన్‌తో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు, పత్రికలపై బూతులు మాట్లాడటం శోచనీయమని వర్లరామయ్య అన్నారు.
వెంట్రుక మహరాజ్.. ఈకల ఎంపరర్ వైఎస్ జగన్..
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి టీడీపీ నేత నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అందరూ ఏకమైనా తనను ఏమీ చేయలేరని, వెంట్రుక కూడా పీకలేరు అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన లోకేష్ సోషల్ మీడియా వేదికగా జగన్ పై విరుచుకుపడ్డారు. ఫ్రస్టేషన్ కాకపోతే ఫన్ వస్తుందా? అంటూ లోకేష్ జగన్ తీరును ఎద్దేవా చేశారు. వెంట్రుక మహరాజ్.. ఈకల ఎంపరర్ వైయస్ జగన్ గారు మీ వెంట్రుకలు పీకే ఓపిక, తీరిక మాకు లేవు అంటూ లోకేష్ కామెంట్ చేశారు. మీ నవరంధ్ర పాలన నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలనే ఆలోచనలతో మేము పనిచేస్తున్నామని సెటైర్లు సందించారు లోకేష్.
గల్లీ నుండి ఢిల్లీ వరకూ పనికిమాలినోడని తేలిపోయిన తరువాత ఫ్రస్టేషన్ కాకపోతే ఫన్ వస్తుందా? వెంట్రుక మహరాజ్.. ఈకల ఎంపరర్ @ysjagan గారూ మీ వెంట్రుకలు పీకే ఓపిక, తీరిక మాకు లేవు. మీ నవరంధ్ర పాలన నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలనే ఆలోచనలతో మేము పనిచేస్తున్నాం.(1/2) pic.twitter.com/ovLSHLc9EC
— Lokesh Nara (@naralokesh) April 8, 2022
నంద్యాల సభలో సీఎం జగన్..
ప్రజలందరి దీవెనతో ముందుకు వెళ్తున్న తనను ఎవరు ఏం చేయలేరంటూ కామెంట్ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(CM YS Jagan). ఇవేవి నన్ను కదిలించలేవు, బెదిరించలేవు, దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనలతో ఈ స్థానానికి వచ్చా. వాళ్లు నా వెంట్రుక కూడా పీకలేరు అని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా మంచి చేసే అవకాశం దేవుడివ్వాలని కోరుకుంటటున్నానన్నారు. నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగనన్న వసతి దీవెన నిధులు విడుదల చేసిన సందర్భంలో సీఎం జగన్ ఈ కామెంట్స్ చేశారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు కనిపించడం లేదని మండిపడ్డారు. పిల్లలకి ఇచ్చే చిక్కీపై సీఎం బొమ్మ ఉందంటూ చిల్లర రాజకీయాలతో రాద్ధాంతం చేస్తున్న ఘనత చంద్రబాబు, ఎల్లో మీడియాదేనని ఎద్దేవా చేశారు సీఎం జగన్.
ఇవి కూడా చదవండి: Pomegranate Benefits: ఆ వయసులోని మహిళలకు ఇదో బంగారు పండు.. రోజు ఒకటి తింటే చాలు నిత్య యవ్వనమే..
APS RTC: ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త ప్రయోగం.. బస్సుల్లోనే కొరియర్, కార్గో బుకింగ్..