తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు అంశం రాజకీయ ప్రకంపనలు రేపుతుంది. ఇప్పటికే ఈ అంశంపై పలువురు కీలక నేతలు స్పందించారు. తెలంగాణలో ఆంధ్ర లీడర్ షిప్ చెల్లదని కామెంట్ చేస్తున్నారు. తాజాగా షర్మిల పార్టీపై రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు.
మంగళవారం మీడియాతో మాట్లాడిన మంత్రి గంగుల.. తెలంగాణలో వేరే పార్టీకి పుట్టగతులు ఉండవని వ్యాఖ్యానించారు. ఇక్కడ టీఆర్ఎస్ తప్ప మరో పార్టీకి అవకాశమే లేదని, వేరే పార్టీలు రావని.. వచ్చినా బతకవని కుండబద్దలు కొట్టారు.
సీమాంధ్ర ఫ్యాక్షన్ రాజకీయాలు తెలంగాణలో నడవవన్నారు. టీఆర్ఎస్‌లో ధిక్కార స్వరమే లేదని, బయట వస్తున్న వార్తలు కరెక్ట్ కాదన్నారు. ఆంధ్రుల పాలన వద్దనే తెలంగాణ సాధించకున్నామని అలాంటిది మళ్లీ ఆంధ్రుల పార్టీని ఎలా ఆమోదిస్తారని గంగుల ప్రశ్నించారు.
Read more: