Nagam Janardhan Reddy: చాలా కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటోన్న తెలంగాణ కాంగ్రెస్ నేత నాగం జనార్థనరెడ్డి ఇవాళ మీడియా ముందుకొచ్చారు. వస్తూ.. వస్తూనే కేసీఆర్ సర్కారుపై సంచలన ఆరోపణలు చేశారు. కృష్ణా జలాల నీటి వాటా కేటాయింపులులో సీఎం కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేసి ఆంధ్ర సీఎం జగన్ మోహన్ రెడ్డితో కుమ్ముక్కు అయ్యారని నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించారు.
ముఖ్యంగా కృష్ణా జలాల నీటి కేటాయింపు విషయంలో సీఎం కేసీఆర్ తీరుపై నాగం జనార్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కుట్రపూరిత ఆలోచనతో ఆంధ్రకు తొత్తుగా మారారని విమర్శించారు. సంగమేశ్వర ప్రాజెక్టు నిర్మాణం డిజైన్ తెలంగాణ భవన్ లో పుట్టిందని, ఇది కుట్రపూరిత కేసీఆర్ ఆలోచన విధానానికి నిదర్శనమని ఆయన ఆరోపించారు.
నీళ్లు, నిధులు, నియామకాలు గురించి పట్టించుకోలేని కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని నాగం ధ్వజమెత్తారు. కేసీఆర్ కుట్రల ఫలితంగా తెలంగాణకు తీరని ద్రోహం జరుగుతోందని ఆరోపించారు. కేసీఆర్ సహకారంతోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ నీటి వాటాని దోచుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే జీఓ 203 పై సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని నాగం ప్రశ్నించారు.
Read also: YS Sharmila: నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో వైయస్ షర్మిల పర్యటన.. ఆదివాసీ ఆచార సాంప్రదాయాలతో స్వాగతం