ఆ పార్టీల చీకటి ఒప్పందం బట్టబయలైంది.. పైసా అవినీతి చేసినా, ఇంచు జాగా వదిలేసినా బజారుకీడుస్తామన్న బండి

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్ ఎన్నికలో ఎంఐఎం మద్దతుతో టీఆర్ఎస్ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మి విజయం..

ఆ పార్టీల చీకటి ఒప్పందం బట్టబయలైంది.. పైసా అవినీతి చేసినా, ఇంచు జాగా వదిలేసినా బజారుకీడుస్తామన్న బండి

Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 11, 2021 | 5:25 PM

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్ ఎన్నికలో ఎంఐఎం మద్దతుతో టీఆర్ఎస్ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మి విజయం సాధించారు. కాగా, బీజేపీ అభ్యర్థి రాధా ధీరజ్ రెడ్డికి నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు.

మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలతో.. టీఆర్‌ఎస్‌, ఎంఎంఐ మధ్య ఉన్న అక్రమ సంబంధం మరోసారి బహిర్గతమైందన్నారు బండి సంజయ్‌. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ చెప్పిందే చివరికి నిజమైందన్నారు. టీఆర్‌ఎస్‌, మజ్లీస్‌ పార్టీలు చీకట్లో ప్రేమించుకుంటూ..బయటికి తాము వేర్వేరని మభ్యపెట్టే ప్రయత్నం చేశాయన్నారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేయకపోయి ఉంటే.. టీఆర్‌ఎస్‌కు సింగిల్‌ డిజిట్‌ సీట్లు కూడా వచ్చుండేవి కావన్నారు.

నీతివంతమైన రాజకీయం చేసేదుంటే బహిరంగ పొత్తు పెట్టుకోవాల్సిందన్నారు బండి సంజయ్‌. ఈ రెండు పార్టీలు కలిసి భాగ్యనగరాన్ని దోచుకునే కుట్ర చేస్తున్నాయని…తమ పార్టీ కార్పొరేటర్లు హైదరాబాద్‌ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. పైసా అవినీతి చేసినా, ఇంచు జాగా వదిలేసినా టీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలను బజారుకు లాగుతామని బండి సంజయ్‌ హెచ్చరించారు.

 

Read more:

ఆ పాట నేను వంద సార్లు విన్నా.. మీరు కూడా విని ప్రజల కష్టాలు తీర్చండి.. మేయర్‌, డిప్యూటీ మేయర్లకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు